రవికిషన్​కు ‘వై ప్లస్’ కేట‌గిరీ భ‌ద్ర‌త

బాలీవుడ్ డ్ర‌గ్స్ చీకటి కోణంపై ఇటీవల లోక్ స‌భ‌లో మాట్లాడినందు‌కు త‌న‌కు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణ‌హాని ఉంద‌ని, భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని బీజేపీ ఎంపీ, న‌టుడు ర‌వికిష‌న్ ప్ర‌భుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

రవికిషన్​కు 'వై ప్లస్' కేట‌గిరీ భ‌ద్ర‌త
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 01, 2020 | 3:20 PM

బాలీవుడ్ డ్ర‌గ్స్ చీకటి కోణంపై ఇటీవల లోక్ స‌భ‌లో మాట్లాడినందు‌కు త‌న‌కు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణ‌హాని ఉంద‌ని, భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని బీజేపీ ఎంపీ, న‌టుడు ర‌వికిష‌న్ ప్ర‌భుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ ర‌వికిష‌న్ కు ‘వై ప్లస్’ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది. త‌న విజ్ఞప్తి మేర‌కు ‘వై ప్ల‌స్’ కేటగిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించినందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఎంపీ ర‌వికిష‌న్ ధ‌న్య‌వాదాలు  తెలుపుతూ ట్వీట్ చేశారు.

‘నా కోసం, నా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం మీరు వై కేట‌గిరీ సెక్యూరిటీ కల్పించారు. ‌నా ఫ్యామిలీతో పాటు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త‌ క‌ల్పించిన మీకు ఎల్లప్పుడూ రుణ‌ప‌డి ఉంటాం. ధ‌న్య‌వాదాలు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌భ‌లో ఎప్పుడూ  గ‌ళాన్ని వినిపిస్తూనే ఉంటా’ అని ర‌వికిష‌న్ ట్వీట్ చేశారు. ప్ర‌జంట్ ర‌వికిష‌న్ యూపీలోని గోర‌ఖ్‌పూర్ లోక్ స‌భ స్థానం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

Also Read :

దేశంలో కరోనా కలవరం

నంద్యాల: నడిరోడ్డుపై నిండు గర్భిణి దారుణ హత్య