Krishna Vamsi’s Ranga Marthanda: రూమర్స్‌కు క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ చెక్.. ‘రంగమార్తండ’ ఆన్ ట్రాక్
"క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి మరో షాక్"... "రంగమార్తండ షూటింగ్‌కు బ్రేకులు"... "కృష్ణవంశీకి హ్యాండ్ ఇచ్చిన ప్రొడ్యూసర్".. నాలుగు రోజులుగా మీడియాలో ఇవే వార్తలు...

Krishna Vamsi’s Ranga Marthanda: “క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి మరో షాక్”… “రంగమార్తండ షూటింగ్‌కు బ్రేకులు”… “కృష్ణవంశీకి హ్యాండ్ ఇచ్చిన ప్రొడ్యూసర్”.. నాలుగు రోజులుగా మీడియాలో ఇవే వార్తలు వైరల్ అయ్యాయి. యూనిట్ కూడా రెస్పాండ్ కాకపోవటంతో నిజమేనేమో అనుకున్నారు కృష్ణవంశీ ఫాలోయర్స్. అయితే ఈ వార్తలకు ఒక్క ఫోటోతో చెక్ పెట్టేశారు కృష్ణవంశీ. రంగమార్తండ ఆన్ కార్డ్స్ అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఓ పాట రాస్తున్నారు. ఈ ఫోటోను షేర్ చేసిన కృష్ణవంశీ ‘గురూజీ మొదలు పెట్టారు. అద్భుతమైన అక్షరాలు ప్రాణం పోసుకుంటున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు.
GURUJEE….. Rushi . #rangamarthanda .. outstanding song s taking life . ? pic.twitter.com/SKGoO65GyH
— Krishna Vamsi (@director_kv) January 9, 2021
దీంతో ఇన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న రూమర్స్‌కు చెక్ పడింది. మరాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’లో ప్రకాష్ రాజ్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు.
Also Read:
Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి
Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 351 పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా




