ఇళ్ళల్లోనే రంజాన్ ప్రార్థనలు… అక్బరుద్దీన్ విఙ్ఞప్తి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను వణికిస్తున్న నేపథ్యంలో ఈసారి రంజాన్ పవిత్ర మాసపు ప్రార్థనలను సామూహికంగా కాకుండా ఎవరి ఇంటిలో వారు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు ఎంఐఎం శాసనసభా పక్షం నేత అక్బరుద్దీన్ ఓవైసీ.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను వణికిస్తున్న నేపథ్యంలో ఈసారి రంజాన్ పవిత్ర మాసపు ప్రార్థనలను సామూహికంగా కాకుండా ఎవరి ఇంటిలో వారు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు ఎంఐఎం శాసనసభా పక్షం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. సామూహిక ప్రార్థనల ద్వారా కరోనా ముప్పు మరింత పెరుగుతుందన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్క ముస్లిం గుర్తించాలని ఆయన సూచించారు.
రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో అక్బరుద్దీన్ టీవీ9 ఛానల్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఈ సారి రంజాన్ మాసం ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిందన్న సంగతిని ఆయన ప్రతీ ఒక్క ముస్లింలకు గుర్తు చేశారు. రంజాన్ మాసంలో ఎవరు బయటికి రాకూడదని, ఇండ్లల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాలని ఆయన ముస్లింలకు సూచించారు.
కరోనా కష్టకాలంలో తమ సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని జూనియర్ ఓవైసీ తెలిపారు. పరిస్థితులు చేయి దాటి పోతే కూడా వీలైనంత వరకూ ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తానని అక్బరుద్దీన్ అంటున్నారు. ‘‘నేను ఈరోజు బతికి ఉన్నానంటే ప్రజల కన్నీటి ప్రార్ధనల వల్లేనని, నేను కష్టాల్లో ఉన్న సమయంలో ప్రజలు నన్ను ఆదుకున్నారు.. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి నా జీవితం ప్రజల కోసం అంకితం చేస్తున్నాను..’’ అని అక్బరుద్దీన్ భావోద్వేగానికి గురయ్యారు.




