రాజు గారి విందులో కిళ్ళీ ఖరీదు వేయి..!

ఈ రాజు గారి జోరు ఢిల్లీలో ఇప్పుడు అంతా ఇంతా కాదు.. 10-12 రోజుల క్రితం ప్రధాన మోదీ స్వయంగా పేరు పెట్టి మరీ.. ’’ రాజుగారు.. హౌ ఆర్ యూ? ‘‘ అని పిలిచినప్పట్నించి ఈ రాజు గారి హవా అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత అమిత్‌షా నివాసం నుంచి సౌత్ బ్లాక్ దాకా ఎక్కడ చూసినా ఈ రాజుగారి హడావిడినే. ఇప్పుడు రాజు గారు మరో న్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. నర్సాపురం […]

రాజు గారి విందులో కిళ్ళీ ఖరీదు వేయి..!
Follow us

|

Updated on: Dec 09, 2019 | 4:48 PM

ఈ రాజు గారి జోరు ఢిల్లీలో ఇప్పుడు అంతా ఇంతా కాదు.. 10-12 రోజుల క్రితం ప్రధాన మోదీ స్వయంగా పేరు పెట్టి మరీ.. ’’ రాజుగారు.. హౌ ఆర్ యూ? ‘‘ అని పిలిచినప్పట్నించి ఈ రాజు గారి హవా అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత అమిత్‌షా నివాసం నుంచి సౌత్ బ్లాక్ దాకా ఎక్కడ చూసినా ఈ రాజుగారి హడావిడినే. ఇప్పుడు రాజు గారు మరో న్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

నర్సాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రఘురామకృష్ణంరాజు డిసెంబర్ 11న రాత్రి ఢిల్లీలో భారీ విందు ఏర్పాటు చేశారు. బిజెపి సహా ఆల్‌మోస్ట్ అన్ని ప్రధాన పార్టీల ముఖ్య నేతలను తాను ఏర్పాటు చేస్తున్న విందుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా తదితరులు రఘురామకృష్ణంరాజు ఏర్పాటు చేసిన విందులో ప్రధాన ఆహ్వానితులు

అయితే.. ఈ విందుకు మోదీ, అమిత్‌షా హాజరు అవుతారా? కారా? అన్న మ్యాటర్ పక్కన పెడితే.. ఈ విందుకు సంబంధించిన ఓ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ మెనుతో రఘురామకృష్ణంరాజు అరేంజ్ చేసిన విందులో ఒక్క కిళ్ళీనే వేయి రూపాయల ఖరీదు చేస్తుందట. సుమారు 3 వేల మంది వి.ఐ.పి.లను విందుకు ఆహ్వానించిన రఘురామకృష్ణంరాజు ఒక్కో కిళ్ళీ వేయి రూపాయలతో తయారు చేయిస్తున్నారట.

ఒక్క కిళ్ళీకే వేయి రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే.. ఈ విందు కోసం రఘురామకృష్ణంరాజు ఏ లెవెల్లో ఫండ్స్ కేటాయిస్తున్నారో ఊహించుకోవచ్చంటున్నాయి ఢిల్లీ మీడియా వర్గాలు. మరి రాజు గారా మజాకా? కానీ ప్రముఖులను ప్రసన్నం చేసుకునేందుకు రఘురామకృష్ణంరాజు చూపిస్తున్న ఈ శ్రద్ద.. నియోజకవర్గం ప్రజలపైనా చూపిస్తే బావుంటుందన్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో జోరందుకుంటున్నాయి.

ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్