ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నా.. కేసీఆర్‌కు హ్యాట్సాఫ్

దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా… మొట్టమొదటి సారిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నానని చెప్పిన ఆయన.. కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. మహిళల భద్రతపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్… దిశ కేసులో నిందితులను కాల్చేసినా తప్పులేదని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు ఆగిపోవాలని.. నిందితులకు తక్షణం […]

  • Updated On - 5:57 pm, Mon, 9 December 19 Edited By: Pardhasaradhi Peri
ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నా.. కేసీఆర్‌కు హ్యాట్సాఫ్

దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా… మొట్టమొదటి సారిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నానని చెప్పిన ఆయన.. కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. మహిళల భద్రతపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్… దిశ కేసులో నిందితులను కాల్చేసినా తప్పులేదని అన్నారు.

మహిళలపై అఘాయిత్యాలు ఆగిపోవాలని.. నిందితులకు తక్షణం శిక్షలు పడేలా కఠిన చర్యలు తీసుకురావాలని ఈ సందర్భంగా జగన్ ఆకాంక్షించారు. చట్టాలను కూడా మరింత కఠినంగా మార్చాలని జగన్ అన్నారు. దిశ లాంటి కేసుల్లో వారం రోజుల్లో విచారణ పూర్తి అయ్యేలా, రెండు వారాల్లో ట్రయల్ పూర్తి అయ్యేలా… 21 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష పడేలా కొత్త చట్టాలు తీసుకురావాలని అన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మద్యం వల్ల మనుషులు మృగాలుగా మారుతున్నారని.. తమ ప్రభుత్వం మద్యాన్ని పూర్తిగా నియంత్రించే పనిలో ఉందని చెప్పుకొచ్చారు.