టీవీ9 ‘భారత్ వర్ష్’ ఛానల్ ప్రారంభ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీః భారత్ వర్ష్ పేరుతో జాతీయ స్థాయిలో టీవీ9 సంస్థ నుంచి హిందీ న్యూస్ ఛానల్ వచ్చింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని మోడీ చేతుల మీదగా ఘనంగా ప్రారంభమైంది. టీవీ9 టీం సభ్యులందరితో ప్రధాని మోడీ కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. కీలకమైన ఎన్నికల ముందు సమయంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలని టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ చెప్పారు. గుజరాత్‌లో ఒక ప్రాంతీయ నాయకులుగా మొదలై నేడు దేశ ప్రధానిగా […]

న్యూఢిల్లీః భారత్ వర్ష్ పేరుతో జాతీయ స్థాయిలో టీవీ9 సంస్థ నుంచి హిందీ న్యూస్ ఛానల్ వచ్చింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని మోడీ చేతుల మీదగా ఘనంగా ప్రారంభమైంది. టీవీ9 టీం సభ్యులందరితో ప్రధాని మోడీ కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. కీలకమైన ఎన్నికల ముందు సమయంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలని టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ చెప్పారు. గుజరాత్‌లో ఒక ప్రాంతీయ నాయకులుగా మొదలై నేడు దేశ ప్రధానిగా మోడీ ఎదిగిన తీరు తమకు ఆదర్శం అని ఆయన అన్నారు.
ఈ ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖ జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. చౌకీదార్ మోడీ చాలా స్వచ్ఛంగా ఉన్నారని, ఎన్నికల్లో గెలుపు తధ్యమని ఆయన చెప్పారు. ఎన్ని సీట్లు గెలుస్తామనేది కచ్చితంగా చెప్పలేము కానీ పూర్తి మెజార్టీ మాత్రం వస్తుందని రాజ్‌నాథ్ అన్నారు.
బెంగాల్, ఒడిశాలో తమకు అధిక సీట్లు వస్తాయని అక్కడ పరిస్థితి ఈసారి పూర్తిగా మారబోతుందని ఆయన తెలిపారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉండాలి. గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోడీపై దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వేలెత్తి చూపలేని పరిస్థితి ఉందని అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.