భారత్‌లో కరోనా విజృంభణ.. మోదీపై రాహుల్ ఫైర్..!

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కమ్మేస్తోంది... ప్రపంచ దేశాలన్నీ హడలిపోతున్నాయి.. ఈ మహమ్మారిని ఎలా కట్టడి చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నాయి... మనదేశంలోనూ కాలిడిన కరోనా ఇప్పటికే ఒకరిని బలి తీసుకుంది

  • Tv9 Telugu
  • Publish Date - 6:48 pm, Fri, 13 March 20
భారత్‌లో కరోనా విజృంభణ.. మోదీపై రాహుల్ ఫైర్..!

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కమ్మేస్తోంది… ప్రపంచ దేశాలన్నీ హడలిపోతున్నాయి.. ఈ మహమ్మారిని ఎలా కట్టడి చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నాయి… మనదేశంలోనూ కాలిడిన కరోనా ఇప్పటికే ఒకరిని బలి తీసుకుంది.. 81 మంది కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు.. వేలాది మంది తమకు కరోనా సోకిందేమోనన్న భీతితో ఉన్నారు.. ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి… ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి భవన్‌ సందర్శనకు అనుమతిని నిలిపివేశారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు చర్యలను ప్రకటించారు అధికారులు. ఇప్పటికే మొఘల్‌ గార్డెన్స్‌ను మూసేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సందర్శకులను అనుమతించరాదన్న నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ ఒక్క కేంద్రమంత్రి కూడా వెళ్లబోరని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రజలు సైతం అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ట్వీట్‌ చేశారు. కోవిడ్‌-19 విస్తరించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఎక్కడా పెద్ద ఎత్తున గుమిగూడకుండా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.

ఇండియాలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తుండటంతో ప్రధాని మోదీని టార్గెట్‌ చేశారు కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ. కోవిడ్‌-19తో ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోందని, అయినా మోదీ సర్కార్‌ మూర్ఖంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వైరస్‌ కట్టడిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం కఠినచర్యలు తీసుకోకపోతే ఆర్ధిక వ్యవస్థ సర్వనాశనం అవుతుందన్నారు. దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్‌-19ను అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా పేర్కొన్నదని , ఏ మాత్రం అనుమానం కలిగినా వైద్యులను సంప్రదించాలని సూచించారు. జ్వరం, దగ్గు ఉంటే 14 రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించారు.

[svt-event date=”13/03/2020,6:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]