Rashi Khanna: ప్రకృతిలో ఒడిలో అందాల తార వర్కవుట్ వీడియో.. వైరల్‌గా మారిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
Rashi Khanna WorkOut Video Viral:ఇటీవలి కాలంలో అందరిలో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా వ్యాయామాలపై ఆసక్తికనబరుస్తున్నారు. సెలబ్రిటీలు కూడా తమ శరీరాన్ని కాపాడుకోవడానికి జిమ్‌ల బాటపడుతున్నారు.
Rashi Khanna WorkOut Video Viral: ఇటీవలి కాలంలో అందరిలో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా వ్యాయామాలపై ఆసక్తికనబరుస్తున్నారు. సెలబ్రిటీలు కూడా తమ శరీరాన్ని కాపాడుకోవడానికి జిమ్‌ల బాటపడుతున్నారు. కేవలం జిమ్‌లలో వర్కవుట్లు చేయడమే కాకుండా తాము చేస్తోన్న కసరత్తులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. దీని ద్వారా తమ అభిమానుల్లోనూ వ్యాయామం పట్ల ఆసక్తికలిగేలా క్యాప్షన్‌లు, కొటేషన్లు రాసుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అందాల తార రాశీ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్రకృతి రమణీయత నడుమ రాశీ ఖన్నా.. వర్కవుట్లు చేస్తోంది. ఇక ఈ వీడియోకు రాశీ గోవా డైరీస్ అనే యాష్ ట్యాగ్ జత చేసింది. అంతేకాకుండా ఈ వీడియోతోపాటు.. ‘ఏదైనా చేయడానికి దారులను వెతుక్కోండి.. సాకులు కాదు (వర్కవుట్ చేయడానికి). ప్రకృతి ఒడిలో’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే రాశీ ఖన్నా ప్రస్తుతం.. తమిళంలో ఏకంగా నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
View this post on Instagram