తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయం.. తొమ్మిది నెలల తర్వాత భక్తులు దర్శనమివ్వనున్న జగన్నాథుడు.
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మూతపడిన ఆలయాల్లో ఒడిశాకు చెందిన పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో మార్చి నుంచి ఆలయంలోకి భక్తుల అనుమతికి నిరాకరించారు.
Puri jagannath temple re open: కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మూతపడిన ఆలయాల్లో ఒడిశాకు చెందిన పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో మార్చి నుంచి ఆలయంలోకి భక్తుల అనుమతికి నిరాకరించారు. ఇక అధికారులు తాజాగా బుధవారం ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆలయంలో పనిచేసే పూజారులు, సేవకులు, సిబ్బంది కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 31 వరకు కేవలం పూరీవాసులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. జనవరి 3 నుంచి ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పించనున్నారు. దేవాలయాన్ని తిరిగి తెరిచినా కోవిడ్ నిబంధనలను మాత్రం కచ్చితంగా పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శనానికి వచ్చే వారు కచ్చితంగా కరోనా నెగిటివ్ ఉందనే రిపోర్ట్ చూపిస్తేనే లోపలికి అనుమతిస్తారు. అంతేకాదు ఆ రిపోర్టు 48 గంటల లోపల పరీక్ష చేయించుకున్న రిపోర్ట్ అయి ఉండాలి.