ఆ రోజును మరిచిపోలేను..

బాలీవుడ్ అందాల జంట ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ కాలిఫోర్నియాలో పండుగ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ కావడంతో అక్కడే ఉంటున్నారు. తన ఫ్యాన్స్ కు ఎప్పడికప్పుడు...

ఆ రోజును మరిచిపోలేను..
Follow us

|

Updated on: Jul 20, 2020 | 3:15 PM

బాలీవుడ్ అందాల జంట ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ కాలిఫోర్నియాలో పండుగ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ కావడంతో అక్కడే ఉంటున్నారు. తన ఫ్యాన్స్ కు ఎప్పడికప్పుడు అప్ డేట్స్ ను అందిస్తున్నారు. తాజాగా ఓ ఆసక్తికరమైన సంగతిని బయటపెట్టారు.

ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా నిక్ త‌నకి ప్ర‌పోజ్ చేసిన‌ప్పుడు రియాక్ష‌న్ ఏంటో చెప్పుకొచ్చారు. ప్రియాంక బుగ్గ‌పై నిక్‌జోనాస్ ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేశారు. 2 ఏళ్ళ క్రితం నా జీవితంలో గొప్ప ఆనందం దక్కింది ఇదే రోజు అంటూ చెప్పారు. ఆ తర్వాతే తనను వివాహం చేసుకోమ‌ని నాకు ప్రపోజ్ చేశాడు. అప్పుడు నా నోరు మూగ‌బోయింది. కాని ఇప్పుడు ప్ర‌తిక్ష‌ణం ‘అవును’ అనే చెప్తాను” అంటూ ప్రియాంక త‌న కామెంట్‌లో రాసుకున్నారు. దీనికి స్పందించిన‌న నిక్ జోనాస్.. ‘అవును’ అని చెప్పినందుకు థ్యాంక్స్… ‘ల‌వ్ యూ బ్యూటీఫుల్’ అని రిప్లై ఇచ్చారు.