Prince William: పేద ప్రజల కోసం చపాతీలు చేసిన ప్రిన్స్ విలియం, మిడిల్టన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Prince William: ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ ఇటీవల స్కాట్లాండ్‌కు చెందిన సిక్కు మద్దతు స్వచ్ఛంద సంస్థలో సిక్కు సంజోగ్‌లో చేరారు. ఎడిన్‌బర్గ్‌లోని వెనుకబడిన వర్గాలకు భోజనం సిద్ధం చేయడంలో వీరు అక్కడ సహాయ పడుతున్నారు.
Prince William: ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ ఇటీవల స్కాట్లాండ్‌కు చెందిన సిక్కు మద్దతు స్వచ్ఛంద సంస్థలో సిక్కు సంజోగ్‌లో చేరారు. ఎడిన్‌బర్గ్‌లోని వెనుకబడిన వర్గాలకు భోజనం సిద్ధం చేయడంలో వీరు అక్కడ సహాయ పడుతున్నారు. దీనికోసం వారు స్వయంగా చపాతీలు చేసి అందిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో కేట్ మరియు విలియం ఇద్దరూ చపాతీ పిండి కలిపి వాటిని గుండ్రంగా ముద్దలుగా చేసి.. తరువాత రోలింగ్ పిన్‌తో చపాతీలను చుట్టారు. అదేవిధంగా ఎడిన్ బర్గ్ లోని క్వీన్స్ రాజ నివాసమైన ప్యాలెస్ ఆఫ్ హోలీహౌస్ లోని వంటగది వద్ద, రాయల్స్ అన్నం, కూరతో బాక్సులను నింపడం కనిపించింది. కేట్ తాను ఎప్పటికప్పుడు ఇంట్లో కూరలను తాయారు చేయడాన్ని ఆస్వాదించానని వెల్లడించింది. ఆమె కొంచెం మసాలా ఇష్టపడుతున్నట్టు చెప్పారు. డ్యూక్ మాట్లాడుతూ, “మసాలా అంత మంచిది కాదు”. అన్నారు.
ప్రిన్స్ విలియమ్స్ చపాతీలు చేస్తున్న వీడియో మీరూ చూడొచ్చు..
“పిల్లలు, సిబ్బంది మీ కంపెనీని నిజంగా ఆనందించారు! ముఖ్యంగా సవాలు సమయాల్లో మహిళలు, యువకుల కోసం మా సేవలు ఎందుకు చాలా ముఖ్యమైనవి అనే దానిపై మీరు మంచి అవగాహన పొందారని మేము ఆశిస్తున్నాము, ”అని సిక్కు సంజోగ్ రాయల్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
“1989 నుండి సిక్కు సంజోగ్ నైపుణ్యాలు, విశ్వాసం మరియు సామాజిక చేరికను ప్రోత్సహించడం ద్వారా వారి స్వంత జీవిత అవకాశాలను అభివృద్ధి చేయడంలో మహిళలను ఉత్తేజపరుస్తున్నారు. వారిని శక్తివంతం చేస్తున్నారు” అని రాయల్ జంట యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ పేర్కొంది.
లాక్డౌన్ సమయంలో సిక్కు సంజోగ్ ప్రజలకు భోజనం వడ్డించారు. “లాక్డౌన్ సమయంలో, సిక్కు సంజోగ్ సమాజంలో వెనుకబడిన ప్రజలకు వారానికి రెండుసార్లు వేడి కూర భోజనం అందించడానికి ఒక సేవను ఏర్పాటు చేశారు.
ప్రిన్స్ విలియమ్స్ కు ధన్యవాదాలు చెబుతూ చేసిన ట్వీట్..
Thank you for coming along to @Sikh_Sanjog @KensingtonRoyal. The children and staff really enjoyed your company! We hope you gained a good understanding of why our services for women and young people are so vital especially in challenging times.#dinnerfitforadukeandduchess https://t.co/UDah83Wkx2
— Sikh Sanjog (@Sikh_Sanjog) May 24, 2021