Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kim Yo-jong: మరీ ఇలా ఉన్నారంటి సామీ.. అన్నను మించిన చెల్లి.. అలాంటి వారిని చంపేయండి అంటూ ఆర్డర్..

Kim Yo-jong: ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి కఠినాత్ముడో అందరికీ తెలిసిందే. ఏమాత్రం తేడా వచ్చినా శాల్తీలు గల్లంతవడం ఖాయం...

Kim Yo-jong: మరీ ఇలా ఉన్నారంటి సామీ.. అన్నను మించిన చెల్లి.. అలాంటి వారిని చంపేయండి అంటూ ఆర్డర్..
Follow us
Shiva Prajapati

|

Updated on: May 26, 2021 | 10:54 PM

Kim Yo-jong: ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి కఠినాత్ముడో అందరికీ తెలిసిందే. ఏమాత్రం తేడా వచ్చినా శాల్తీలు గల్లంతవడం ఖాయం. అయితే, అతని కంటే కఠినాత్మురాలు అతని సోదరి కిమ్ యో జోంగ్. ఇదే విషయం తాజాగా వెలుగు చూస్తోంది. ఆమె క్రూర చర్యలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. క్రూరత్వంలో అన్న వారసత్వాన్ని అందిపుచ్చుకుంటోంది కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్.

ఉత్తర కొరియాలో తమ అధికారానికి వ్యతిరేకంగా గొంతు విప్పేవారిని సైలెంట్‌గా గొంతు కోసేస్తున్నారు. తమ వ్యతిరేకుల పట్ల అత్యంత క్రూరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ‘క్లీన్ డ్రైవ్’లో భాగంగా యో జోంగ్ చాలా మంది అధికారులను చంపించినట్లు తాజాగా బయటకువచ్చింది. ఈ వార్త ఉత్తర కొరియా అధికారులను మరింత హడలెత్తిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులను తుపాకులతో కాల్చి చంపాలని ఆమె ఆదేశించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే కొందరు అధికారులను ఆమె చంపించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. గతేడాది నవంబర్‌లోనే కిమ్ యో జోంగ్ ఈ ఉత్తర్వులు ఇచ్చారట. కాగా, ఉత్తర కొరియాలో బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు తెప్పించుకున్న యో జోంగ్.. సరిహద్దు భద్రతా దళానికి చెందిన 10 మంది అధికారులను డిసెంబర్ నెలలో కాల్చి చంపారట. అంతేకాదు.. మరో తొమ్మిది మంది అధికారులకు జీవిత ఖైదు విధించారట.

ఇదిలాఉంటే.. కిమ్ యో జోంగ్ తన పార్టీ అధికారాన్ని సవాలు చేస్తున్న అధికారుల గురించి సమాచారం సేకరించడంలో బిజీగా ఉన్నారట. నిరసన గొంతు వినిపింపచే వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంపేయాలని ఆర్డర్స్ ఇచ్చారట. యో జోంగ్ ఆదేశాలతో ఆమె అనరులు అధికారుల వ్యవహార శైలిని సమీక్షిస్తున్నారు. ఈ చర్య వలన ప్రత్యర్థులను గుర్తించి, తమకు అడ్డులేకుండా చేయవచ్చునని ప్లాన్ వేశారు కిమ్ జోంగ్ ఉన్, ఆయన సోదరి కిమ్ యో జోంగ్.

Also read:

Nidhhi Agerwal : `డిస్ట్రిబ్యూట్ లవ్` అంటున్న అందాల నిధి.. కోవిడ్ బాధితులకు సాయంగా..

Narendra Modi: ప్రధాని మోడీ.. ఏడేళ్ళు.. ఏడు ప్రధాన నిర్ణయాలు.. ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఇచ్చాయి

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!