పెట్రోల్ ధర హైదరాబాద్‌లో ఇలా..
పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్‌పై 11పైసలు పెంచాయి చమురు సంస్థలు. దిల్లీలో లీటరు పెట్రోలు రూ.81.94కు చేరింది. మరోవైపు డీజిల్ ధరల స్థిరంగా కొనసాగుతుండటం...

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్‌పై 11పైసలు పెంచాయి చమురు సంస్థలు. దిల్లీలో లీటరు పెట్రోలు రూ.81.94కు చేరింది. మరోవైపు డీజిల్ ధరల స్థిరంగా కొనసాగుతుండటం విశేషం.
పెట్రో ధరల వాత కొనసాగుతోంది. గడచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్ ధరను పెంచాయి చమురు సంస్థలు. శుక్రవారం లీటరు పెట్రోల్‌పై 11 పైసలు పెంచాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.81.94 కి చేరింది. 13 రోజుల్లో చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై రూ.1.51 పైసలు పెంచాయి. హైదరాబాద్‌లో మాత్రం పెట్రోల్ రూ. 85.04చేరింది. మరోవైపు గత కొన్ని రోజులుగా డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దిల్లీలో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.73.56పైసలుగా ఉంది.
