ఘర్ కీ ఖేతీ..అంటున్న సొట్టబుగ్గల సుందరి

ఇంట్లో ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయలను పండిస్తున్నారు. మొన్న అక్కినేని కోడలు మిద్దెపై పండించిన పంటలను చూపించింది. ఇప్పుడు అదే బాటలో బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా...

  • Sanjay Kasula
  • Publish Date - 7:10 pm, Thu, 30 July 20
ఘర్ కీ ఖేతీ..అంటున్న సొట్టబుగ్గల సుందరి

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎక్కడ కరోనా రక్కసి దాగుందో అన్న భయంతో వణికిపోతున్నారు. సేఫ్ జోన్ లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అత్యవసరం అయితే తప్పా.. కాలు బయట పెట్టడం లేదు. ఇంట్లోనే ఉండటంతో రూఫ్ గార్డెన్‌పై ఇష్టం పెంచుకుంటున్నారు.

ఇంట్లో ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయలను పండిస్తున్నారు. మొన్న అక్కినేని కోడలు మిద్దెపై పండించిన పంటలను చూపించింది. ఇప్పుడు అదే బాటలో బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా వచ్చి చేరింది. తమ ఇంటి మేడపై వివిధ రకాల కూరగాయలను పండించింది. గత రెండు  నెలలుగా చేస్తున్న ప్రీతి చేస్తున్న సాగు ఫలితాలను ఇచ్చింది.

ఇంట పండిన క్యాప్సికమ్‌ను అభిమానులకు చూపెడుతూ తెగ మురిసిపోయింది. తన ఇస్‌స్టా ఖాతాలో క్యాప్సికమ్‌ పట్టుకొని దిగిన వీడియోను పోస్ట్ చేసింది.‘మా సొంత ఇంటి తోట.. ఘర్ కీ ఖేతీ… అమ్మకు ధన్యవాదాలు.. ఇప్పుడు నాకు పూర్తిస్థాయి కిచెన్ గార్డెన్ ఉంది. సొంతంగా కూరగాయలు పండించేందుకు నన్ను ప్రోత్సహించినందుకు, నాకు నేర్పినందుకు అమ్మా నీకు కృతజ్ఞతలు’ అంటూ రాసింది. తాను వెజిటెబుల్స్‌ను సేంద్రియపద్ధతిలో పండిస్తున్నట్లు తెలిపింది.