AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్మ ‘మర్డర్’ కహానీపై.. ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..

ప్రణయ్ హత్య కేసు ఆధారంగా 'మర్డర్' సినిమాకు ప్లాన్ చేసిన రామ్ గోపాల్ వర్మకు ఎస్టీ, ఎస్సీ కోర్టు షాక్ ఇచ్చింది . ఆయనపై కేసు నమోదు చేయాలంటూ మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది.

వర్మ 'మర్డర్' కహానీపై.. ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..
Ravi Kiran
|

Updated on: Jul 04, 2020 | 2:58 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్ హత్య కేసు’ ఆధారంగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ అనే సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తాజాగా ఆర్జీవీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలంటూ మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది. ‘ఆర్జీవీ తీయబోయే ‘మర్డర్’ సినిమా ప్రణయ్ హత్య కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందంటూ ఇటీవల అతని తండ్రి బాలస్వామి నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదును పరిశీలించిన కోర్టు ఆర్జీవీపై కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: కరోనా మృతుల అంత్యక్రియలపై ఏపీ ప్రభుత్వం సూచనలు..

కాగా, ఫాదర్స్ డే రోజున ‘మర్డర్’ పోస్టర్‌ను రిలీజ్ చేసిన ఆర్జీవీ.. ప్రణయ్ భార్య అమృత, ఆమె తండ్రి మారుతీరావు విషాదగాఢపై సినిమా తీస్తున్నట్లుగా ప్రకటించారు. కూతురును అతిగా ప్రేమిస్తే వచ్చే ప్రమాదాలు ఏంటన్న దానిపై తన సినిమా కథాంశం ఉంటుందంటూ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తినా.. కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ మాత్రం సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మరి ఇప్పుడు ఈ కేసుపై వర్మ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Also Read: రెస్ట్ ఇన్ పీస్ వర్మా… నీపై కేసులు వేయనుః అమృత

Follow Us
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి