Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి e-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో 2 శాఖలలో e-ఆఫీసును ప్రారంభించారు.
  • హైదరాబాద్ లో పెరిగిన ఫోర్ వీలర్లఅమ్మాకాలు . మేనెలతో పోల్చితే రెండు నుంచి మూడింతలు పెరిగిన సేల్స్. సేల్స్ పెరగడంతో రిజిస్ట్రేషన్లు పెరిగాయంటున్న హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు . మే నెలలో 326 ఫోర్ వీలర్ల రిజిస్ట్రేషన్లు. జూన్ లో 848 , జూలై లో 1149 రిజిస్ట్రేషన్లు . ఆర్ టి ఎ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ పాండు రంగా నాయక్.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్. హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళా ను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసము. పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ పై పోలీస్ రికార్డుల్లో నుంచి రౌడీ షీట్ తొలగించము. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించం. గతంలో వీరంతా తప్పులు చేసి, నేరాలు చేసి జైల్ వెళ్లిన వారు. కానీ ఇప్పుడు ఒక సదవకాశం వీరు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబం తో సంతోషంగా జీవించాలని సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్న.
  • విజయవాడ: కోవిడ్‌ ఆస్పత్రి సిబ్బంది చేతివాటం. రోగుల మొబైల్స్, డబ్బులు మాయం. సెల్‌ చోరీ చేస్తున్న దృశ్యాలు. సీసీ కెమెరాల్లో రికార్డు. ఒక రోగి అదృశ్యంపై అధికారులు సీసీ కెమెరాలు పరిశీలన. ఓ ఉద్యోగి రోగి సెల్‌ఫోన్‌ తస్కరించడం చూసి అధికారులు షాక్. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఉద్యోగి పై ఎవరు అనే కోణంలో దర్యాప్తు. సిబ్బంది ప్రవర్తనపై అధికారులు ఆరా.
  • బ్లాక్ బస్టర్ ఆగస్టుకు ఆహా OTT రెడి. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆహా OTT ఆగస్టులో 10 సినిమా లను అందిస్తుంది. పాపులర్ యాంకర్ సుమ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తదితరులు ఫేసుబుక్ లైవ్ ద్వారా పలు విషయాలు ప్రకటించారు. మొదట దిల్ రాజు బుచ్చినాయుడు కండ్రిగ సినిమాని ప్రకటించారు. ఆగస్ట్ 21న ఆహాలో విడుదల. తెనుగు వినోదాన్ని అందిస్తున్న ఆహా OTT లో ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా చూడవచ్చు. పాపులర్ కమెడియన్ హర్ష సరికొత్త రియాలిటీ షో ప్రకటించారు. తమాషా విత్ హర్ష అనే సరికొత్త షో ఈనెల 22నుండి మొదలు. చివరగా సుమ OTT లో తొలిసారి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. సమకాలీన అంశాలతో అల్ ఈజ్ వెల్ అనే వెరైటీ షో ని ప్రకటించారు. ఆగస్ట్ 14 నుండి సుమ ఆల్ ఈజ్ వెల్ ప్రసారం అవుతుంది.

కరోనా మృతుల అంత్యక్రియలపై ఏపీ ప్రభుత్వం సూచనలు..

కరోనా మృతుల అంత్యక్రియలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించారు. మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందటం లేదన్న ఆయన..
Coronavirus Dead Bodies AP Health Secretary Jawahar Reddy, కరోనా మృతుల అంత్యక్రియలపై ఏపీ ప్రభుత్వం సూచనలు..

కరోనా మృతుల అంత్యక్రియలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించారు. మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందటం లేదన్న ఆయన.. కరోనా రోగి చనిపోయిన ఆరు గంటల తర్వాత వైరస్ శరీరంపై ఉండదని స్పష్టం చేశారు. వారి దహన సంస్కారాలను ఎవరూ అడ్డుకోవద్దని, ఇబ్బందులు సృష్టించవద్దని తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు ఇంకా అశ్రద్ధ చూపిస్తున్నారన్న ఆయన.. ప్రస్తుతం ఏపీలో ఒకరి నుంచి 1.12 మందికి కరోనా సోకుతోందన్నారు. ఈ గణాంకం రెండు దాటితే ప్రమాదం ఉన్నట్లేనని ఆయన చెప్పారు.

Also Read: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!

కాగా, ఏపీలో కరోనా పరీక్షలను పెంచామని జవహర్ రెడ్డి వెల్లడించారు. మిలియన్‌కు 18,200 మందికి పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9.7 లక్షల మందికి కరోనా టెస్టులు చేశామన్నారు. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమయ్యాక కేసులు పెరుగుతున్నాయని.. దేశం, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అన్నారు. వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో పరిశీలిస్తున్నామన్న ఆయన.. నిర్మాణం, వ్యవసాయ రంగం కార్మికులకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నామని తెలిపారు. కరోనా చికిత్స కోసం త్వరలోనే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అనుమతిస్తామని.. ధరల విషయంలో మాత్రం ఖచ్చితంగా నియంత్రణ ఉంటుందన్నారు. కాగా, కరోనాను కట్టడి చేసేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న వైద్యులపై పనిభారం తగ్గించేందుకు కొత్తవారిని నియమిస్తామని జవహర్ రెడ్డి వెల్లడించారు.

Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్‌లెస్ ప్రయాణం..!

Related Tags