కరోనా వైరస్…మొదట మేమే చెప్పాం.. చైనా కాదు..ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ గురించి మొదట చైనాలోని తమ కార్యాలయమే వెల్లడించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్ పై చైనా సమాచారాన్ని తమతో షేర్ చేసుకుందని..

కరోనా  వైరస్...మొదట మేమే చెప్పాం.. చైనా కాదు..ప్రపంచ ఆరోగ్య సంస్థ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2020 | 2:50 PM

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ గురించి మొదట చైనాలోని తమ కార్యాలయమే వెల్లడించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్ పై చైనా సమాచారాన్ని తమతో షేర్ చేసుకుందని ఇన్నాళ్లూ చెబుతూ వఛ్చిన ఈ సంస్థ.. తాజాగా మాట మార్చింది. కోవిద్-19 తొలి దశ గురించి… ముఖ్యంగా మొదటి న్యుమోనియా కేసుల గురించి తామే  అలర్ట్ చేసినట్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్ ను గురించిన సమాచారాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయకుండా చైనా తొక్కిపెట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించగా.. చైనా ఈ ఆరోపణలను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ 9 న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..  తన కమ్యూనికేషన్లకు సంబంధించిన తొలి టైం లైన్ ని ప్రచురించింది. ట్రంప్  ఈ సంస్థను కూడా  తప్పు పట్టి… దీనికి నిధులను స్తంభింపజేసిన నేపథ్యంలో..  దాదాపు వివరణ ఇచ్చింది. హుబే ప్రావిన్స్ లోని వూహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్.. డిసెంబరు 31 న న్యుమోనియా కేసుల గురించి ప్రస్తావించింది.  అయితే  దీని విషయమై ఎవరు నోటిఫై చేశారన్న అంశాన్ని మాత్రం పక్కన పెట్టింది.

ఈ వైరస్ కు సంబంధించి తొలి సమాచారం మొదట చైనా నుంచి వచ్చిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసిస్ గత ఏప్రిల్ 20 న ప్రకటించారు. కానీ దీన్ని చైనా అధికారులు పంపారా లేక మరేదైనా వర్గాల నుంచి అందిందా అన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. తాజాగా ఈ వారంలో ప్రచురితమైన ఓ నివేదికలో మరిన్ని విశేషాలను ప్రస్తావించారు.

చైనాలోని తమ కార్యాలయమే గత డిసెంబరు 31 న వైరల్ న్యుమోనియా కాంటాక్ట్ కేసుకు సంబంధించి సమాచారాన్ని నోటిఫై చేసిందనిఈ నివేదికలో పేర్కొన్నారు. వూహాన్ హెల్త్ కమిషన్ వెబ్ సైట్ లో కనుగొన్న డిక్లరేషన్ ఆధారంగా దీనిని నోటిఫై చేసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. అదే రోజున తమ సంస్థలోని ఎపిడమిక్ ఇన్ఫర్మేషన్ విభాగం.. అమెరికాలోని ఇంటర్నేషనల్ ఎపిడెమియోలాజికల్ సర్వేలెన్స్ నెట్ వర్క్ అయిన..’ప్రో-మెడ్’ ట్రాన్స్ మీట్ చేసిన మరో  వార్తను కూడా ప్రచురించిందని పేర్కొన్నారు. వూహాన్ లో అంతు చిక్కని కారణాల వల్ల న్యుమోనియా కేసులు బయటపడినట్టు వెల్లడించిన రిపోర్టును తాము పరిగణనలోకి తీసుకున్నామని ఇందులో వివరించారు. అనంతరం జనవరి 1న, 2 న (రెండు సందర్భాల్లో) ఈ కేసుల గురించి చైనాను వివరణ కోరగా.. ఆ మరుసటిరోజున ఆ దేశ అధికారులు దీన్ని అందజేశారట. కాగా -చైనా పట్ల తామేమీ పక్షపాతం చూపలేదని ఈ  సంస్థ మళ్ళీ స్పష్టం చేసింది.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!