ఫిట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తున్న కోహ్లీ

పాండ్యాకు ఇలా చేయాలని ఛాలెంజ్ విసిరాడు. ఇప్పుడు తాజాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన జిమ్‌లో వర్కవుట్ చేసి చూపించారు. ఇది తన ఫేవరెట్ అని కూడా చెప్పారు...

  • Sanjay Kasula
  • Publish Date - 2:13 pm, Sat, 4 July 20
ఫిట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తున్న కోహ్లీ

Virat Kohli Favourite Exercise : లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు ఇంటికే పరిమతమయ్యారు. అయితే ఇంట్లో ఏదో ఒక విషయాన్ని కొత్త నేర్చుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా చేస్తున్నవారిలో క్రికెట్, సినీ ప్రముఖులు ముందు వరుసలో నిలుస్తున్నారు.

అయితే క్రికెట్ ఆటగాళ్లు మాత్రం ఫిట్‌నెస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. శారీరక దారుడ్యాన్ని కాపాడుకునేందుకు ఇంట్లోనే తెగ కష్టపడుతున్నారు. ఇలా టీమిండియా సభ్యులో ఒకరి తర్వాత.. ఒకరు తమ ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా జిమ్ చేసి కండలు పెంచడమేకాకుండా గాల్లోకి ఎగురుతూ పుష్ అప్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ పుష్ అప్స్ వీడియోని సోషల్ మీడియాలో హార్దిక్ పోస్ట్ చేయగా.. బాలీవుడ్ హీరోయిన్స్ సయామీ ఖేర్​, కరిష్మా తనా ఫిదా అయ్యారు. ఇక హార్దిక్ తన సోదరుడు కృనాల్ పాండ్యాకు ఇలా చేయాలని ఛాలెంజ్ విసిరాడు. ఇప్పుడు తాజాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన జిమ్‌లో వర్కవుట్ చేసి చూపించారు. ఇది తన ఫేవరెట్ అని కూడా చెప్పారు. తాను రోజూ ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటే అది ఇదే.. అని ట్విట్టర్ రాసుకొచ్చారు.

 

View this post on Instagram

 

If I had to make a choice of one exercise to do everyday, this would be it. Love the power snatch 💪😃

A post shared by Virat Kohli (@virat.kohli) on

గతంలో టీమిండియా ఆటగాళ్లు ఆటపైనే ఫోకస్ పెట్టేవారు.. ఎప్పుడైతే కోహ్లీ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి గ్రౌండ్‌తోపాటు జిమ్‌పై ప్రత్యేక ద‌ృష్టి పెట్టారు. ఇండియన్ క్రికెట్‌లోకి ప్లేయర్ “యోయో టెస్ట్” పాస్ అవ్వక తప్పదు. అందులో పాస్ అయితేనే జట్టులోకి ఎంపికవుతారు. 2017 మధ్య నుంచి టీమిండియా జట్టులో  ఫిట్‌నెస్‌కి సంబంధించి యోయో పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు.