ఎన్నికల సంఘానికి లెటర్ రాసిన నటుడు పోసాని

సినీనటుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. చంద్రబాబు కు కులాన్ని ఆపాదిస్తూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పోసానికి నోటీసులు పంపింది. కాగా.. ఈ నోటీసులపై పోసాని స్పందించారు. ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. సీఎంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. తాను నడవలేని స్థితిలో […]

  • Updated On - 4:46 pm, Thu, 21 March 19 Edited By: Srinu Perla
ఎన్నికల సంఘానికి లెటర్ రాసిన నటుడు పోసాని

సినీనటుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. చంద్రబాబు కు కులాన్ని ఆపాదిస్తూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పోసానికి నోటీసులు పంపింది. కాగా.. ఈ నోటీసులపై పోసాని స్పందించారు. ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. సీఎంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. తాను నడవలేని స్థితిలో ఉన్నానని, ఆపరేషన్ కోసం యశోదా ఆస్పత్రిలో చేరానని తెలిపారు.