ఈ మాతృమూర్తికి ఎన్ని వందనాలు చేస్తే సరిపోతుంది…
సాయం స్తోమతను బట్టి చేసేది. అది చేసే మనిషి మనసు స్థాయిని డిసైడ్ చేస్తోంది. డబ్బుంటే వాచ్ మెన్ నీకు సెల్యూట్ చేస్తాడు. అదే వాచ్ మెన్ కు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తే..కలకలం చల్లగా ఉండమని దీవిస్తాడు. ఇప్పుడు చెప్పబోయే మాతృమూర్తికి ఎన్ని వందనాలు చేస్తే సరిపోతుందో మీరే చెప్పాలి. ఆమె ఓ పేద మహిళా కూలీ. రోజంతా శ్రమ చేస్తోంది. నెలకు రూ.3,500 సంపాదిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా ఆమెకు వస్తుందో, […]

సాయం స్తోమతను బట్టి చేసేది. అది చేసే మనిషి మనసు స్థాయిని డిసైడ్ చేస్తోంది. డబ్బుంటే వాచ్ మెన్ నీకు సెల్యూట్ చేస్తాడు. అదే వాచ్ మెన్ కు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తే..కలకలం చల్లగా ఉండమని దీవిస్తాడు. ఇప్పుడు చెప్పబోయే మాతృమూర్తికి ఎన్ని వందనాలు చేస్తే సరిపోతుందో మీరే చెప్పాలి.
ఆమె ఓ పేద మహిళా కూలీ. రోజంతా శ్రమ చేస్తోంది. నెలకు రూ.3,500 సంపాదిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా ఆమెకు వస్తుందో, లేదో తెలీదు. కరోనా లాక్ డౌన్ అమలు చేసే పనిలో భాగంగా పోలీసులు నిత్యం ఎన్ని కష్టాలు ఎదుర్కుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మన ప్రాణాల కోసం వారు కుటుంబాలను సైతం వదిలేసి ఎండనకా, వాననకా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ విషయాన్ని గమనించిన సదరు మహిళా కూలీ…పోలీసుల కోసం రెండు పెద్ద కూల్ డ్రింక్ బాటిళ్లను కొని ఇవ్వడానికి వచ్చింది. ఆ మహిళా కూలీ చేసిన పనికి అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసుల మనసు చలించిపోయింది. వెంటనే ఆమెను ఎక్కడ పనిచేస్తావు. ఎంత జీతమొస్తుంది లాంటి ప్రశ్నలు అడిగారు. ఆమె వివరాలు తెలిపాక..’ఎంతగొప్ప మనసమ్మ నీది’..అంటూ ఆమె తెచ్చిన కూల్ డ్రింక్ బాటిల్స్ వెనక్కి ఇవ్వడమే కాకుండా..తమ వద్ద ఉన్న బాటిల్స్ కూడా ఆమెకే ఇచ్చి పిల్లలకు ఇవ్వమన్నారు. చదువుకున్న వాళ్ల కంటే నువ్వు 100 రెట్లు గొప్ప అమ్మా..అంటూ అభినందించారు. ఆకాశమంతా మంచి మనుసును పిడికెడు గుండెలో దాచుకున్న మట్టి మనిషి ఆమె..అమాయకంగా నవ్వుతూ..సాయం అనే ముతకచీర చుట్టుకున్న దేవత ఆమె…ఆమెను చూస్తుంటే మండు వేసవిలోనూ మనసు చల్లగయ్యింది. మనసారా నవ్వుతూనే కళ్లు చెమర్చేలా చేసింది. నాకైతే ఆమె అచ్చం అమ్మాలాగే తోస్తోంది.
Her salary is 3500 See that smile in her face. This video made my day. Share this video bro…..this might also make some one’s day.. ❤️❤️❤️ pic.twitter.com/iSV1jjIvYA
— Sai Praneeth || (@I_m_sai_555) April 14, 2020