జమ్మూలో ఏబీవీపీ ఆందోళన

ABVP Protesting : జమ్మూలో ఏబీవీపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జమ్మూ క్లస్టర్‌ యూనివర్సిటీలో సీట్ల సంఖ్యను పెంచాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సివిల్‌ సెక్రటేరియట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు , విద్యార్ధుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో చాలామంది విద్యార్ధులు కిందపడిపోయారు. విద్యార్ధినులకు కూడా ఆందోళనలో గాయాలయ్యాయి. యూనివర్సిటీలో సీట్ల సంఖ్య పెంచాలని మూడేళ్ల నుంచి ఆందోళనలు చేస్తునప్పటికి అధికార […]

జమ్మూలో ఏబీవీపీ ఆందోళన
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 13, 2020 | 12:02 AM

ABVP Protesting : జమ్మూలో ఏబీవీపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జమ్మూ క్లస్టర్‌ యూనివర్సిటీలో సీట్ల సంఖ్యను పెంచాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సివిల్‌ సెక్రటేరియట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు , విద్యార్ధుల మధ్య తోపులాట జరిగింది.

తోపులాటలో చాలామంది విద్యార్ధులు కిందపడిపోయారు. విద్యార్ధినులకు కూడా ఆందోళనలో గాయాలయ్యాయి. యూనివర్సిటీలో సీట్ల సంఖ్య పెంచాలని మూడేళ్ల నుంచి ఆందోళనలు చేస్తునప్పటికి అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపించారు. అప్లికేషన్ల పేరుతో అధికారులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని , దీని వెనుక పెద్ద స్కామ్‌ ఉందని మండిపడ్డారు.

జమ్మూలో ఆందోళన చేస్తున్న విద్యార్దులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. వందలాదిమంది విద్యార్ధులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని అంటున్నారు స్టూడెంట్స్‌.