AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020, RCB vs KKR : అదరగొట్టిన ఆర్సీబీ ..చిత్తుగా ఓడిన కేకేఆర్

ఐపీఎల్ తాజా సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మంచి విజయాలతో దూసుకుపోతుంది. అన్ని విభాగాల్లో మంచి ప్రదర్శన చేస్తూ విజయాల్ని ఒడిసిపడుతుంది.

IPL 2020, RCB vs KKR : అదరగొట్టిన ఆర్సీబీ ..చిత్తుగా ఓడిన కేకేఆర్
Ram Naramaneni
|

Updated on: Oct 12, 2020 | 11:42 PM

Share

ఐపీఎల్ తాజా సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మంచి విజయాలతో దూసుకుపోతుంది. అన్ని విభాగాల్లో మంచి ప్రదర్శన చేస్తూ విజయాల్ని ఒడిసిపడుతుంది. సోమవారం రాత్రి షార్జా వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్‌పై ​ కోహ్లీసేన 82 పరుగుల తేడాతో బంఫర్ విక్టరీ నమోదు చేసింది. బెంగళూరు నిర్దేశించిన 195 టార్గెట్ ఛేదనలో కోల్‌కతా పేకమేడలా కూలిపోయింది. భీకర ఫామ్‌లో ఉన్న బెంగళూరు బౌలర్ల ధాటికి కోల్‌కతా 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(34: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) ఆ టీమ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(1)తో సహా మిగతా బ్యాట్స్‌మెన్‌ టామ్‌ బాంటన్‌(8), నితీశ్‌ రాణా(9), ఇయాన్‌ మోర్గాన్‌(8), ఆండ్రూ రస్సెల్‌(16) దారుణంగా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌(2/20), క్రిస్‌ మోరీస్‌(2/17) చెరో రెండు వికెట్లు తీశారు. చాహల్‌, ఉదాన, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీలకు ఒక్కో వికెట్‌ దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఏబీ డివిలియర్స్‌(73 నాటౌట్‌; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్బుతమైన ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు బెంగళూరు 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆర్సీబీ ఓపెనర్లు దేవదూత్‌ పడిక్కల్‌(32; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అరోన్‌ ఫించ్‌(47; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించింది. దాటిగా ఆడుతున్న దాటిగా ఆడుతున్న పడిక్కల్‌ (32) రసెల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఫించ్‌(47) కూడా బౌల్డై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కోహ్లి(33 నాటౌట్‌; 28 బంతుల్లో 1 ఫోర్‌) సహకారంతో డివిలయర్స్ డెత్ ఓవర్లలో చెలరేగిపోయాడడు. పోర్లు,సిక్స్‌లతో ఆకాశమే హద్దుగా ఆడాడు.

Follow Us
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
తిరుమలలో సర్పాల సంరక్షణపై టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్ష
తిరుమలలో సర్పాల సంరక్షణపై టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్ష
థియేటర్లలో ఇరుముడి సంచలనం..
థియేటర్లలో ఇరుముడి సంచలనం..
ఏటీఎం ఛార్జీలు భారీగా పెంచిన ప్రభుత్వ బ్యాంక్.. ఇప్పటినుంచి..
ఏటీఎం ఛార్జీలు భారీగా పెంచిన ప్రభుత్వ బ్యాంక్.. ఇప్పటినుంచి..
వీళ్ల స్నేహానికి చావే సలాం కొట్టింది.. గుండెల్ని హత్తుకునే..
వీళ్ల స్నేహానికి చావే సలాం కొట్టింది.. గుండెల్ని హత్తుకునే..
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్‌న్యూస్!
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్‌న్యూస్!