కోళ్ల పందెంరాయుళ్లకు పోలీసుల బ్రేక్!

సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఏపీలో ఊపందుకున్నాయి. సంక్రాంతి పండుగకు ముఖ్యంగా కోళ్ల పందేలు నిర్వహించడం ఏపీ వాసులకు ఆనవాయితీ. పండుగ మూడు రోజులూ ఏపీలో కోలాహలంగా ఉంటుంది. ఈ కోళ్ల పందేలకు దేశ, విదేశాల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పందేలను చూడటానికి ఇతర దూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంటారు. కాగా.. కోళ్ల పందేల సందర్భంగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కోర్టు ధిక్కరించినా.. పోలీసులు భయపెట్టినా.. కోళ్ల పందేలు తప్పనిసరి అంటున్నారు. దీంతో.. పోలీసులు […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:57 pm, Tue, 7 January 20
కోళ్ల పందెంరాయుళ్లకు పోలీసుల బ్రేక్!

సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఏపీలో ఊపందుకున్నాయి. సంక్రాంతి పండుగకు ముఖ్యంగా కోళ్ల పందేలు నిర్వహించడం ఏపీ వాసులకు ఆనవాయితీ. పండుగ మూడు రోజులూ ఏపీలో కోలాహలంగా ఉంటుంది. ఈ కోళ్ల పందేలకు దేశ, విదేశాల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పందేలను చూడటానికి ఇతర దూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంటారు. కాగా.. కోళ్ల పందేల సందర్భంగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కోర్టు ధిక్కరించినా.. పోలీసులు భయపెట్టినా.. కోళ్ల పందేలు తప్పనిసరి అంటున్నారు. దీంతో.. పోలీసులు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో.. నెల్లూరు జిల్లా మకిలీపురంలో పందెం రాయుళ్లు కోళ్లను విక్రయిస్తుండగా.. వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏకంగా 45 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.