పోలీస్ స్టేషన్‌లో విహెచ్ హల్‌చల్

హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు హల్‌చల్ చేశారు. తానిచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు పెట్టలేదని పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దానిపై కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. పోలీసుల సమాధానంతో సంతృప్తి చెందన వి.హెచ్., తానిక హైకోర్టును ఆశ్రయిస్తానని పోలీసులను హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న హనుమంతరావు సి.ఐ, ఎస్.ఐ.లతో భేటీ అయ్యారు. తను వారం రోజుల కిందట మోహన్ […]

పోలీస్ స్టేషన్‌లో విహెచ్ హల్‌చల్
Follow us

|

Updated on: Jan 07, 2020 | 2:45 PM

హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు హల్‌చల్ చేశారు. తానిచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు పెట్టలేదని పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దానిపై కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. పోలీసుల సమాధానంతో సంతృప్తి చెందన వి.హెచ్., తానిక హైకోర్టును ఆశ్రయిస్తానని పోలీసులను హెచ్చరించారు.

మంగళవారం మధ్యాహ్నం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న హనుమంతరావు సి.ఐ, ఎస్.ఐ.లతో భేటీ అయ్యారు. తను వారం రోజుల కిందట మోహన్ భగవత్ పైన ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని వి.హెచ్. పోలీసు అధికారులను నిలదీశారు. తాము న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నామని, ఇందులో కేసు నమోదు చేసే అంశాలు లేవని.. అందుకే కేసు నమోదు చేయలేక పోయామని పోలీసులు సమాధానమిచ్చారు. దాంతో విహెచ్ ఆగ్రహంతో ఊగిపోయారు.

చౌకిదార్ చోర్ అన్నందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టి క్షమాపణ అడిగిన పోలీసులు.. సెక్యూలర్ దేశంలో అందరూ హిందువులేనంటూ మిగిలిన మతాల వారిన బాధ పెట్టిన ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్‌పై కేసు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు హనుమంతరావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశంలో అన్ని మతాలు సమానమన్న మాటలు నమ్మాలా లేక 130 కోట్ల మంది హిందువులేనన్న మోహన్ భగవత్ మాటలను నమ్మాలా అంటూ ఆయన అడిగారు. ఈ విషయంలో పోలీసులిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విహెచ్.. హైకోర్టును ఆశ్రయిస్తానంటూ పోలీస్ స్టేషన్ నుంచి నిష్క్రమించారు.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.