ఏమిటా భాష ? మోదీ నిప్పులు ..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ విజయ్ వర్గీయ వ్యవహారం ఢిల్లీలో ఇంకా హాట్ హాట్ గానే సాగుతోంది. ఓ మున్సిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి తన తలపొగరును ‘ చాటిన ‘ ఈ యువ ఎమ్మెల్యేపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సాక్షాత్తూ ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించడం సీనియర్ నేతలను సైతం ఆశ్చర్యపరిచింది. పార్టీలో ‘ డిసిప్లిన్ సెషన్ ‘ మొదలైనట్టు ఉందని కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక […]

ఏమిటా భాష ? మోదీ  నిప్పులు ..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 03, 2019 | 4:18 PM

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ విజయ్ వర్గీయ వ్యవహారం ఢిల్లీలో ఇంకా హాట్ హాట్ గానే సాగుతోంది. ఓ మున్సిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి తన తలపొగరును ‘ చాటిన ‘ ఈ యువ ఎమ్మెల్యేపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సాక్షాత్తూ ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించడం సీనియర్ నేతలను సైతం ఆశ్చర్యపరిచింది. పార్టీలో ‘ డిసిప్లిన్ సెషన్ ‘ మొదలైనట్టు ఉందని కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేని మనం కోల్పోతే కోల్పోనివ్వండి..జరిగే నష్టమేమీ లేదు.. కానీ మళ్ళీ అలాంటిది జరగకుండా చూడాలంటే మనం ఓ నిర్ణయం తీసుకుని అందరికీ ఆదర్శప్రాయం కావాలి.. ఎవరైనా సరే ! అలాంటి ప్రవర్తన ఏమాత్రం సమర్థనీయం కాదు.. సహించరానిది కూడా అని మోదీ పేర్కొన్నారు. ఇండోర్ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్య తీసుకోవలసిందే అన్నారాయన. మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్ ను ఝళిపించిన తన చర్యను ఆకాష్ సమర్థించుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంలో ఆయన.. .. మొదట సామ, దాన, ధర్మోపాయాలను పాటిస్తానని, ఎదుటివారు వినకపోతే ఇక దండమే (దాడే) తన ‘ ధర్మమని ‘ తానేదో పెద్ద మనిషిలా హెచ్ఛరించాడు. ఈ కామెంట్..ఎలా చేరిందో..మోదీ వరకు వెళ్ళింది. ఇలాంటి భాషను తాను సహించేది లేదని ఆయన అన్నారు. కాగా- బెయిలుపై ఇండోర్ జైలు నుంచి విడుదలైన ఆకాష్ కు అతని సహచరులు మెడలో పూలమాలవేసి ‘ ఘన స్వాగతం ‘ పలికిన తీరు కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. దీనిపై అధికారులు ఆరా తీయగా.. ఇండోర్ లోని ఆకాష్ మద్దతుదారులు.. అలాంటిదేమీ లేదని ‘ తప్పు ‘ ను కప్పి పుచ్చుకోజూశారు. ఆకాష్ వద్దకు ఎవరూ వెళ్లలేదని, ఆయనకు ఘనంగా స్వాగతం పలికామనడం అబధ్ధమని వారన్నారు. అయితే ఆకాష్ కి వారు పూలమాలతో వెల్ కమ్ చెప్పిన దృశ్యాలు వీడియోలో రికార్డయిన సంగతి విదితమే.