వ్యాక్సిన్ ప్రభావం 28 రోజుల తర్వాతే! ఫైబర్ టీకా గురించి కీలక విషయాలు.. ఎలా పని చేస్తుందంటే.?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీకాకు బ్రిటన్ ప్రభుత్వం...

వ్యాక్సిన్ ప్రభావం 28 రోజుల తర్వాతే! ఫైబర్ టీకా గురించి కీలక విషయాలు.. ఎలా పని చేస్తుందంటే.?
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 07, 2020 | 1:46 PM

Pfizer Vaccine: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీకాకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో మంగళవారం నుంచి మార్కెట్‌లోకి వచ్చింది. అలాగే భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఒకవేళ ఈ టీకాకు ప్రభుత్వం అనుమతిస్తే.. దానికి సంబంధించిన కీలక వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఫైజర్ టీకాను 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది
  • వైరస్‌ను నియంత్రించేందుకు రెండు డోసులు తీసుకోవాలట. ఒక్కో డోస్ రూ. 1500 ఉంటుందట
  • డోసులు తీసుకున్న 28 రోజుల్లో వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది
  • మొదటి డోస్ తీసుకున్న 12 రోజుకు రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందటం ప్రారంభమవుతుంది.
  • 21వ రోజున రెండో డోస్ తీసుకోవాలి
  • 28వ రోజున పూర్తిస్థాయి రోగనిరోధక శక్తి అభివృద్ధి అవుతుంది.