రైతులపై కేసులు ఎత్తివేత.. పెప్సికో వెనకడుగు

ఆలుగడ్డ పండించే రైతుల నుంచి బలంగా న్యాయ పోరాటం ఎదుర్కొంటున్న అమెరికా కంపెనీ పెప్సికో చివరికి వెనకడుగు వేసింది. బనాసంకాఠా, సాబర్ కాంఠా, ఆరావళి జిల్లాల రైతులపై వేసిన కేసులను పెప్సికో ఉపసంహరించుకుంది. ఇక ఈ విషయాన్ని రైతుల తరపు న్యాయవాది ఆనంద్ యాజ్ఞిక్ మీడియాకు తెలియజేసారు. అంతేకాదు దీనిని రైతుల విజయంగా ఆయన అభివర్ణించారు. లేస్ చిప్స్ కోసం ఉపయోగించే ఎఫ్‌సి5 తరహా ఆలుగడ్డలకు పేటెంట్ తీసుకున్నామని, రైతులు వాటిని అక్రమంగా పండిస్తున్నారంటూ పెప్సికో గుజరాత్‌కి […]

రైతులపై కేసులు ఎత్తివేత.. పెప్సికో వెనకడుగు
Follow us

| Edited By: Srinu

Updated on: May 11, 2019 | 6:45 PM

ఆలుగడ్డ పండించే రైతుల నుంచి బలంగా న్యాయ పోరాటం ఎదుర్కొంటున్న అమెరికా కంపెనీ పెప్సికో చివరికి వెనకడుగు వేసింది. బనాసంకాఠా, సాబర్ కాంఠా, ఆరావళి జిల్లాల రైతులపై వేసిన కేసులను పెప్సికో ఉపసంహరించుకుంది. ఇక ఈ విషయాన్ని రైతుల తరపు న్యాయవాది ఆనంద్ యాజ్ఞిక్ మీడియాకు తెలియజేసారు. అంతేకాదు దీనిని రైతుల విజయంగా ఆయన అభివర్ణించారు.

లేస్ చిప్స్ కోసం ఉపయోగించే ఎఫ్‌సి5 తరహా ఆలుగడ్డలకు పేటెంట్ తీసుకున్నామని, రైతులు వాటిని అక్రమంగా పండిస్తున్నారంటూ పెప్సికో గుజరాత్‌కి చెందిన 9 మంది రైతులపై కేసులు పెట్టింది. పెప్సీ కోలా, లేస్ చిప్స్ తయారుచేసే పెప్సీకో అమెరికాలోని హెడ్ క్వార్టర్, ఆసియా పసిఫిక్ ప్రాంతం కార్యాలయం రైతులపై చట్టపరమైన కేసు నమోదు చేసిన భారత శాఖ చర్యపై విచారం వ్యక్తం చేసింది. పెప్సికో కేసు పెట్టడంపై దేశవ్యాప్తంగా ప్రజలు రైతులకు అండగా నిలిచారు.  సోషల్ మీడియాలో పెప్సికో చర్యను తీవ్రంగా విమర్శించారు. దీనితో పెప్సికో వెనకడుగు వేయాల్సి వచ్చింది.