కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో క్షణం క్షణం.. భయం భయం.. మాటు వేసి మజా చేస్తోంది రక్తం మరిగిన పులి..

కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటంతో అటవీ పరిసర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో క్షణం క్షణం.. భయం భయం.. మాటు వేసి మజా చేస్తోంది రక్తం మరిగిన పులి..
Follow us
uppula Raju

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 03, 2020 | 3:50 PM

Tiger fear in Asifabad district: కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటంతో అటవీ పరిసర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ప్రజలు పొలాల వద్దకు, వ్యవసాయ పనులకు పోవద్దని అటవీ అధికారులు చాటింపు వేయిస్తున్నారు. అడవిలో పెద్దపులి తిరుగుతోందని అటువైపు వెళ్లొద్దని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు, ఆదివాసీలు అయోమయంలో పడిపోయారు. క్షణం క్షణం.. భయం భయంగా బతుకుతున్నారు.

ఇప్పటికే జిల్లాలోని దహేగావ్ మండలం దిగుటలో ఒకరిని, పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో ఒకరిని పులి పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి ఎక్కడ మాటువేసి ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు పంటలు చేతికందే సమయంలో ఇదేం సమస్య అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా దాడులు చేస్తున్న కిల్లర్ క్యాట్‌ వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే పులి అందరిపై దాడి చేస్తుందా లేకుంటే రకరకాల పులులు తిరుగుతున్నాయా తెలియడం లేదంటున్నారు అటవీ అధికారులు. దీంతో పులి సంచారంపై గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసేందుకు గ్రామ కమిటీలను వేస్తున్నారు. పులి సంచారంతో పాటు దాని అడుగులను కనుగొని తమకు సమాచారం చేరవేయాలని కోరుతున్నారు. గతంలో ఉన్న వనసంరక్షణ సమితుల సాయం కూడా తీసుకుంటున్నారు. తొందరగా పులిని పట్టుకొని తమకు స్వేచ్ఛను కల్పించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?