‘కరోనా కాలర్ ట్యూన్’ ఇలా కట్ చేయండి.. నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అందులో నిజమెంత.!
కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా.. ‘కోవిడ్-19 జాగ్రత్త చర్యల’ కాలర్ ట్యూన్ వస్తుంది. ఈ కాలర్ ట్యూన్..
Coronavirus Caller Tune: కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా.. ‘కోవిడ్-19 జాగ్రత్త చర్యల’ కాలర్ ట్యూన్ వస్తుంది. ఈ కాలర్ ట్యూన్ ప్రస్తుతం దేశమంతా మారుమ్రోగుతోంది. అయితే తాజాగా ఈ కాలర్ ట్యూన్‌ను ఈజీగా Turn Off చేయవచ్చునని చెబుతూ ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే అది కాస్తా ఫేక్ అని తేలింది. ఇక ఆ నకిలీ పోస్టులో కోవిడ్-19 కాలర్ ట్యూన్ ఆపేందుకు సూచించిన మార్గాలు ఇవే..
ఎయిర్‌టెల్‌లో కరోనా కాలర్ ట్యూన్‌ను కట్ చేయడం ఎలా?
* 646 * 224 # డయల్ చేసి, 1 నొక్కండి. కరోనా కాలర్ ట్యూన్ ఆపడానికి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
వొడాఫోన్‌లో కరోనా కాలర్ ట్యూన్‌ను ఎలా ఆపాలి?
144 నెంబర్‌కు “CANCT” మెసేజ్ పంపిస్తే.. కాలర్ ట్యూన్ సేవలను ఆపడానికి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
జియోలో కరోనా కాలర్ ట్యూన్‌ను ఆపండిలా?
155223కు “STOP” అని పంపిస్తే… మీ కాలర్ ట్యూన్ సేవలను ఆపడానికి మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్‌లో కరోనా కాలర్ ట్యూన్‌ను ఎలా ఆపాలి?
“UNSUB” అని టైప్ చేసి 56700 లేదా 56799కు పంపండి. మీ కాలర్ ట్యూన్ సేవలను ఆపడానికి కన్ఫర్మేషన్ వస్తుంది.
కాగా, ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ”కరోనా కాలర్ ట్యూన్”ను ఏర్పాటు చేసింది. దానిని మనం టర్న్ ఆఫ్ చేయలేము. అంతకుముందు, తొలి రోజుల్లో పొడి దగ్గుతో కాలర్ ట్యూన్ మొదలయ్యేది. అయితే ఇటీవలే ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్, బీఎస్ఎన్‌ఎల్ దగ్గుకు సంబంధించిన ఆడియో భాగాన్ని కత్తిరించాయి. ఆ స్థానంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హిందీ, ఇంగ్లీష్ భాషలలో మాట్లాడేది వినిపిస్తున్నాయి.