ఏపీ: కోవిడ్ టెస్ట్ స్టేటస్ కోసం ప్రత్యేక యాప్.. చెక్ చేసుకోండిలా!

కరోనా టెస్టులు చేయించుకున్న వారు తమ శాంపిల్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేసింది.

ఏపీ: కోవిడ్ టెస్ట్ స్టేటస్ కోసం ప్రత్యేక యాప్.. చెక్ చేసుకోండిలా!
Follow us

|

Updated on: Aug 05, 2020 | 10:09 AM

COVID 19 Sample Status Check: కరోనా కాలంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే కరోనా టెస్టులు చేయించుకున్న వారు తమ శాంపిల్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేసింది. కోవిడ్ 19 ఏపీ(COVID 19 AP) పేరిట నూతన యాప్‌ను లాంచ్ చేసింది. ముందుగా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని.. ఆ తర్వాత శాంపిల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకుని మీ వివరాలను అప్‌లోడ్ చేస్తే చాలు.. మొత్తం డేటాతో కూడిన ఓ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది.

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కరోనా టెస్ట్ రిజల్ట్స్‌ను తెలుసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది తమ కరోనా టెస్టు ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయంటూ ఫిర్యాదులు చేయగా.. వారి కోసం ప్రభుత్వం ఈ నూతన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా టెస్టులు చేయించుకున్నవారు.. వారికి ఇచ్చిన శాంపిల్స్ నెంబర్, అధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ ఉపయోగించి టెస్టు రిజల్ట్స్‌ను వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్ లింక్:  http://covid19.ap.gov.in/Covid19_Admin/CovidSampleHistory.html

యాప్ లింక్: https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..