ఏం చేయాలో మీరే చెప్పండి.. రైతాంగానికి పవన్ షాక్
అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతాంగానికి న్యాయం చేసేందుకు తానేమి చేయాలో చెప్పాలని ఆ ప్రాంత ప్రజలను కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరావతి ఏరియాలో శుక్రవారం పర్యటించిన పవన్ కల్యాణ్‌ను పలు గ్రామాల రైతులు కలుసుకున్నారు. తమకు అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేసేలా ఉద్యమించాలని వారంతా పవన్ కల్యాణ్‌ని అభ్యర్థించారు. రైతులు గోడు విన్న పవన్ కల్యాణ్.. అమరావతి ఏరియా రైతాంగానికి అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వుందని అన్నారు. […]
అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతాంగానికి న్యాయం చేసేందుకు తానేమి చేయాలో చెప్పాలని ఆ ప్రాంత ప్రజలను కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరావతి ఏరియాలో శుక్రవారం పర్యటించిన పవన్ కల్యాణ్‌ను పలు గ్రామాల రైతులు కలుసుకున్నారు. తమకు అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేసేలా ఉద్యమించాలని వారంతా పవన్ కల్యాణ్‌ని అభ్యర్థించారు.
రైతులు గోడు విన్న పవన్ కల్యాణ్.. అమరావతి ఏరియా రైతాంగానికి అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వుందని అన్నారు. రాష్ట్రం మొత్తం ఈ అంశంపైనే చర్చ జరుగుతుందన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, మహిళలు రోడ్ల పైకి రావడం బాధేస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయి ఒకసారి నష్టపోయాంమని, మరోసారి అలా నష్టపోయే పరిస్థితి రాకూడదని జనసేనాని అన్నారు. అమరావతి నగర నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలంటే జనసేన పార్టీ పక్షాన తామేం చేయాలో చెప్పాలని ఆయన తనను కలిసిన వారిని కోరారు. జనసేన ఉద్యమానికి సలహాలివ్వాలని పవన్ కల్యాణ్ అభ్యర్థించారు.
అదే సమయంలో రాజధానిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో కాంగ్రెస్, బీజేపీ తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్ట ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి కూడా బాధ్యత వుందని, అందుకోసమే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు పవన్ కల్యాణ్. కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. భూములిచ్చిన రైతులతో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, రాజధాని రైతులకు అన్యాయం జరగకూడదని ఆయన అన్నారు.