దారుణం.. యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం
ఒంగోలులో ఓ యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కానిస్టేబుల్. ఏకాంతంగా ఉన్న ప్రేమజంటను బెదిరించి… ప్రియుడిని గాయపరిచి అనంతరం యువతిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు గద్దలగుండ్లకు చెందిన యువతీయువకులు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏకాంతం కోసం వీరిద్దరూ ఒంగోలు నగరంలోని వంగమూరు రోడ్డు సమీపానికి వచ్చారు. ఇదే అదునుగా భావించిన కానిస్టేబుల్ ప్రేమజంటను బెదిరించాడు. అంతేకాకుండా.. ప్రియుడిపై దాడి చేసి యువతిని మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. […]
ఒంగోలులో ఓ యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కానిస్టేబుల్. ఏకాంతంగా ఉన్న ప్రేమజంటను బెదిరించి… ప్రియుడిని గాయపరిచి అనంతరం యువతిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు గద్దలగుండ్లకు చెందిన యువతీయువకులు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏకాంతం కోసం వీరిద్దరూ ఒంగోలు నగరంలోని వంగమూరు రోడ్డు సమీపానికి వచ్చారు. ఇదే అదునుగా భావించిన కానిస్టేబుల్ ప్రేమజంటను బెదిరించాడు. అంతేకాకుండా.. ప్రియుడిపై దాడి చేసి యువతిని మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ యువతిని వంగమూరు ప్రాంతంలో వదిలివెళ్లాడు.
ఈలోగా తేరుకున్న ప్రియుడు తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం తెలుపగా.. వారు గాలించగా.. అదే ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిన ఉన్న యువతి కనిపించింది. విషయం తెలుసుకున్న ప్రియుడు.. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకున్న పోలీసులు అదేరాత్రి నిందితుడు ఆనంద్‌ని అరెస్ట్ చేశారు. ఆనంద్.. కొత్తపట్నం పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. ఆనంద్ గతంలోనూ ఇలాంటివే చేసి సస్పెండ్‌కి గురయ్యాడు.
కాగా.. కానిస్టేబుల్ ఆనంద్ సోదరుడు ఇంకొల్లు రాంబాబు సీఐ కావడంతో ఈ విషయాన్ని బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా విచారించారు. కానీ ఈ సంఘటన ఎస్పీ సిద్ధార్థ కౌశల్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. దీంతో.. కానిస్టేబుల్ ఆనంద్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నార పోలీసులు.