AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేప్ చేసినట్లు సాక్ష్యమేది.. బాధితురాలితో వినుకొండ సీఐ అసభ్య ప్రవర్తన!

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకోవడంలోనే కాకుండా ఆ కేసుల విచారణలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తనపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వస్తే.. ఆమె పట్ల సీఐ అవమానకరంగా వ్యవహరించిన తీరు కలకలం రేపుతోంది. ఈ దారుణం గుంటూరు జిల్లాలోని వినుకొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సదరు మహిళ భర్తతో విడిపోయి కొంతకాలంగా స్థానికంగా ఉన్న బేకరీలో పని చేస్తోంది. ఒకానొక సమయంలో […]

రేప్ చేసినట్లు సాక్ష్యమేది.. బాధితురాలితో వినుకొండ సీఐ అసభ్య ప్రవర్తన!
Ravi Kiran
|

Updated on: Jan 11, 2020 | 5:01 PM

Share

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకోవడంలోనే కాకుండా ఆ కేసుల విచారణలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తనపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వస్తే.. ఆమె పట్ల సీఐ అవమానకరంగా వ్యవహరించిన తీరు కలకలం రేపుతోంది. ఈ దారుణం గుంటూరు జిల్లాలోని వినుకొండలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సదరు మహిళ భర్తతో విడిపోయి కొంతకాలంగా స్థానికంగా ఉన్న బేకరీలో పని చేస్తోంది. ఒకానొక సమయంలో ఆ బేకరికి వచ్చిన ఓ యువకుడు ఆమెపై కన్నేశాడు. ప్రతిరోజూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె వెంటపడుతూ ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. అంతటితో ఆగకుండా ఆమె ఒంటరిగా ఉండటం గమనించిన ఆ కామాంధుడు రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి బెదిరించి అత్యాచారానికి పాలపడ్డాడు. అంతేకాకుండా అదంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ ఆమెను బెదిరించాడు. దీనితో భయపడిన ఆమె ఎవరికి చెప్పలేదు.

ఇదే అదునుగా తీసుకున్న ఆ నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్నీ అతడికి చెబితే.. బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఇక అప్పటి నుంచి ఆ యువకుడు ఫోన్ స్విచాఫ్ చేసి తిరుగుతుండటంతో.. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే మూడు నెలలుగా పోలీసులు పట్టించుకోలేదు.

దీంతో ఆమె స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయన వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలని వినుకొండ పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఫిర్యాదు చేయడానికి వినుకొండ పోలీస్ స్టేషన్‌కు ఆమె వెళ్లగా.. అక్కడి సీఐ చిన్నమల్లయ్య ఆగ్రహంతో ఊగిపోయి.. ‘ఏంటి నువ్వు.. ఎన్నిసార్లు వస్తావ్.. చెప్తే అర్ధంకాదా. అసలు నిన్ను రేప్ చేసింది వాడే అనడానికి ప్రూఫ్ ఉందా.? ఎందుకమ్మా మీలాంటోళ్లు మా తలలు తింటారు.? ముందుకు బయటికి పో’ అంటూ అసభ్యంగా మాట్లాడారు. దయ చేసి తన వేదనను అర్ధం చేసుకుని ఎస్పీ, జిల్లా కలెక్టర్‌లు న్యాయం చేయాలని బాధితురాలు ఓ వీడియో ద్వారా కోరింది.