హైదరాబాద్ : మోడల్‌పై మైనర్ అత్యాచారం…వీడియో రికార్డింగ్
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సినీ ఇండస్ట్రీలో రాణించేందుకు కోటి ఆశలతో నగరానికి వచ్చిన ఓ యువతిపై దుండగుడు అత్యాచారం చేశాడు. ఆ అఘాయిత్యాన్ని అతడి స్నేహితుడు వీడియో రికార్డింగ్ చేశాడు. ఈ విషయంపై పోలీసు స్టేషన్‌కు వెళ్లిన యువతికి అక్కడ చుక్కెదురైంది. కంప్లైంట్ మార్చి రాయాలంటూ ఒత్తిడి చేయడంతో, ఆమె తన గోడును మీడియాతో చెప్పుకుంది. సినిమా, మోడలింగ్ ఫీల్డ్స్‌లో స్థిరపడదామని పోయిన సంవత్సరం హైదరాబాద్‌కి వచ్చిన యువతి(21) ఎల్లారెడ్డిగూడలోని ఓహాస్టల్‌లో ఉంటూ ఛాన్సస్ కోసం ట్రై […]
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సినీ ఇండస్ట్రీలో రాణించేందుకు కోటి ఆశలతో నగరానికి వచ్చిన ఓ యువతిపై దుండగుడు అత్యాచారం చేశాడు. ఆ అఘాయిత్యాన్ని అతడి స్నేహితుడు వీడియో రికార్డింగ్ చేశాడు. ఈ విషయంపై పోలీసు స్టేషన్‌కు వెళ్లిన యువతికి అక్కడ చుక్కెదురైంది. కంప్లైంట్ మార్చి రాయాలంటూ ఒత్తిడి చేయడంతో, ఆమె తన గోడును మీడియాతో చెప్పుకుంది.
సినిమా, మోడలింగ్ ఫీల్డ్స్‌లో స్థిరపడదామని పోయిన సంవత్సరం హైదరాబాద్‌కి వచ్చిన యువతి(21) ఎల్లారెడ్డిగూడలోని ఓహాస్టల్‌లో ఉంటూ ఛాన్సస్ కోసం ట్రై చేస్తోంది. ఈ క్రమంలో హాస్టల్ యజమాని కొడుకు(17) ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా స్నేహంగా మారింది. అయితే నాలుగు నెలల క్రితం ఆమె మరో యువతితో కలిసి జూబ్లీహిల్స్ ఏరియాలో ఓ రూమ్ అద్దెకి తీసుకుని నివాసముంటుంది. ఈ క్రమంలో డిసెంబర్ 28వ తేదీ రాత్రి హాస్టల్ ఓనర్ కొడుకు, అతని స్నేహితుడు గంజాయి కిక్కులో ఆమె ఉంటోన్న రూమ్‌కి వచ్చారు. యువతిని బలవంతపెట్టి హాస్టల్ ఓనర్ కుమారుడు అత్యాచారం చేయగా, మరో వ్యక్తి సెల్‌ఫోన్‌తో రికార్డు చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో బయటకు రిలీజ్ చేస్తామని బెదిరించి ఇద్దరు యువకులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. వేధింపులు ఎక్కువడంతో ఈ నెల 7న జూబ్లీహిల్స్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చేందుకు యువతి వెళ్లింది. అక్కడ స్టేషన్ ఎస్సై సుధీర్‌రెడ్డి ఆమె ఫిర్యాదును రికార్డు చేసుకున్నారు. అయితే కంప్లైంట్ మార్చి రాయాలని డిఐ ఒత్తిడి చేయడంతో ఆమె మీడియాను ఆశ్రయించింది. నిందితులను గెస్టుల్లాగా ఛైర్స్‌లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని, ఇలా అయితే తనకు న్యాయం జరగదని వాపోయింది. దీనిపై మీడియా జూబ్లీహిల్స్ పోలీసులను వివరణ కోరగా, వారు యువతి ఆరోపణలు ఖండించారు. నిందితులు అదుపులో ఉన్నారని, వారిపై రేప్ కేసు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కె.ఎస్.రావు తెలిపారు.