పవన్ నెక్ట్స్ పట్టాలెక్కించే సినిమా అదే… 30 రోజుల కాల్షీట్స్ కేటాయించిన పవర్ స్టార్… షూటింగ్ ఎప్పుడంటే…
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రస్తుతం వకీల్‌సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. లెక్కప్రకారం అయితే క్రిష్ జాగర్లమూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. కానీ, పవన్ మరో సినిమాను లైన్‌లోకి ముందుగా తెచ్చాడట.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రస్తుతం వకీల్‌సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అయితే, పవన్ చేయబోయే తర్వాతి సినిమా ఏంటన్నది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో ఐదు మూవీస్ ఉన్నాయి. లెక్కప్రకారం అయితే క్రిష్ జాగర్లమూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. కానీ, పవన్ మరో సినిమాను లైన్‌లోకి ముందుగా తెచ్చాడట.
ఆ సినిమా ఏంటంటే… మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోశియుమ్. రీమేక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఇద్దరు హీరోలుంటారు. ఓ హీరోగా పవన్ నటిస్తుంటే.. మరో హీరో పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఫిలీంనగర్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారట. జనవరి 2 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. దాదాపు నెలరోజుల కాల్షీట్ మాత్రమే కేటాయించాడట పవన్. పవన్ ఇమేజ్, తెలుగు నెటివిటీకి తగ్గట్లు కథలో చాలా మార్పులు, చేర్పులు చేశారట, అంతేకాకుండా త్రివిక్రమ్ సైతం సినిమా నిర్మాణంలో ముందుండబోతున్నట్లు సమాచారం. ఇందులో పవన్ సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
లైన్‌లో ఉన్న సినిమాలు ఇవే…
వాకీల్‌సాబ్, అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ పూర్తి కాగానే క్రిష్ సినిమా మొదలవుతుంది. అనంతరం హరీశ్ శంకర్-మైత్రీ మూవీస్ కాంబినేషన్‌లో సినిమా ఉంది. సురేందర్ రెడ్డి-ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్ రామ్ తాళ్లూరి సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇది కాకుండా బండ్ల గణేశ్‌తో పవన్ ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు బండ్ల గణేశ్ తెలియజేశాడు. అయితే పవన్ ఒకవైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలతో బిజీగా ఉంటున్నారు.



