AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్ సాయం..నిలిచిన ప్రాణం

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశాఖ శారదా పీఠానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. తిరిగి వచ్చే సమయంలో కొందరు యువతీయువకుల సేవ్ ఆవర్ ఫ్రెండ్ అంటూ  ఫ్లకార్డ్స్ పట్టుకొని నిలబడటం దృష్టిలో పడటంతో జగన్ కాన్వాయ్ వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. తమ స్నేహితుడు నీరజ్ కుమార్ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాడని.. అతడి జబ్బు నయం కావాలంటే రూ.25 లక్షలు అవుతుందని వైద్యులు చెబుతున్నారని.. రోజువారీగా కూలీ చేసుకునే వారి […]

సీఎం జగన్ సాయం..నిలిచిన ప్రాణం
Ram Naramaneni
|

Updated on: Jun 22, 2019 | 1:43 PM

Share

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశాఖ శారదా పీఠానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. తిరిగి వచ్చే సమయంలో కొందరు యువతీయువకుల సేవ్ ఆవర్ ఫ్రెండ్ అంటూ  ఫ్లకార్డ్స్ పట్టుకొని నిలబడటం దృష్టిలో పడటంతో జగన్ కాన్వాయ్ వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

తమ స్నేహితుడు నీరజ్ కుమార్ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాడని.. అతడి జబ్బు నయం కావాలంటే రూ.25 లక్షలు అవుతుందని వైద్యులు చెబుతున్నారని.. రోజువారీగా కూలీ చేసుకునే వారి తల్లిదండ్రులకు అంత మొత్తం సాధ్యం కాదని..తాము ఎంత ప్రయత్నం చేసినా డబ్బు సర్దలేకపోతున్నాని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయలో భాదిత నీరజ్ ప్రెండ్స్‌తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు.

వారిని చూసి చలించినపోయిన జగన్.. ఎంత ఖర్చు అయినా పరవాలేదని.. తప్పనిసరిగా బిడ్డను కాపాడుకుందామని సీఎం వారికి హామి ఇచ్చారు. నీరజ్ వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన ఆయన.. తక్షణమే వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అప్పటికప్పుడు వైద్యం కోసం రూ.10 లక్షలు ప్రభుత్వం నుంచి చెల్లించారు.

అంతేకాదు.. వైద్యానికి అయ్యే ఖర్చు ఎంతైనా ఫర్లేదని.. ప్రభుత్వం భరిస్తుందని సీఎంవో అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీరజ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అతనికి ప్రస్తుతం కీమోథెరపీ చేస్తున్నారు. గుండెకు రక్తప్రసరణలో తలెత్తిన సమస్యను వైద్యులు సరి చేశారు. దీంతో ఆక్సిజన్ అవసరం లేకుండా  వైద్యాన్ని అందిస్తున్నారు.

గతంలో  పైప్ ద్వారా ఆహారం తీసుకున్న నీరజ్ ప్రస్తుతం నేరుగా నోటి నుంచి ఆహారాన్ని తీసుకుంటున్నట్లు  అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. సీఎం జగన్‌కు తామెప్పుడూ రుణపడి ఉంటామని నీరజ్ ఫ్రెండ్స్ అంటున్నారు.