కనీసం నన్ను చెత్తకైనా మంత్రిగా నియమించండి: గోవా ఎమ్మెల్యే

కనీసం తనను చెత్తకైనా మంత్రిగా నియమించాలంటూ గోవా డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో శుక్రవారం ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కోరారు. కేబినెట్ పదవి ఆశించిన ఆయనకు గోవా ప్రభుత్వం ఎలాంటి మంత్రిత్వ శాఖను ఇవ్వలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఆయన కనీసం చెత్తకైనా మంత్రిగా చేయాలంటూ పేర్కొన్నారు. ‘‘గత 25సంవత్సరాలుగా చెత్త సమస్యకు పరిష్కారం కోసం ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రపంచ దేశాలకు వెళ్తున్నారు. కానీ ఎవరూ ఈ సమస్యకు పరిష్కారాన్ని […]

కనీసం నన్ను చెత్తకైనా మంత్రిగా నియమించండి: గోవా ఎమ్మెల్యే
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 1:46 PM

కనీసం తనను చెత్తకైనా మంత్రిగా నియమించాలంటూ గోవా డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో శుక్రవారం ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కోరారు. కేబినెట్ పదవి ఆశించిన ఆయనకు గోవా ప్రభుత్వం ఎలాంటి మంత్రిత్వ శాఖను ఇవ్వలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఆయన కనీసం చెత్తకైనా మంత్రిగా చేయాలంటూ పేర్కొన్నారు.

‘‘గత 25సంవత్సరాలుగా చెత్త సమస్యకు పరిష్కారం కోసం ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రపంచ దేశాలకు వెళ్తున్నారు. కానీ ఎవరూ ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోకుండానే వస్తున్నారు. ఇప్పుడు ఈ సమస్యకు ఒక మంత్రిత్వ శాఖ కచ్చితంగా అవసరం. చెత్త అంటే కంపు కాబట్టి.. ఎవరూ ఆ శాఖను కావాలనుకోరు. కానీ ఆ బాధ్యతలు నిర్వర్తించేందుకు నేను సిద్ధం’’ అంటూ మైఖేల్ పేర్కొన్నారు.

అయితే 2017లో గోవాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లోబో కీలక పాత్ర పోషించారు. అయినా ఆయనకు మంత్రిత్వ శాఖ రాకపోవడంపై ఆయన బహిరంగంగానే బీజేపీపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఇటీవల లోబో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి సావంత్.. లోబోకు ప్రభుత్వంలో పెద్ద పదవి ఇస్తామంటూ ప్రకటించారు. కానీ ఇప్పటికీ.. ఏ మంత్రిత్వ శాఖను ఆయనకు కేటాయించలేదు. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. ఇదిలా ఉంటే గోవాలో సముద్ర తీర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. దీనివలన ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు టూరిస్ట్‌లు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెత్త సమస్యను పరిష్కారంటూ లోబో ప్రభుత్వానికి విన్నవించారు.

Latest Articles