పతంజలి నుంచి కరోనా ఔషధం.. క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. చాలా దేశాలు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు ముమ్మరం చేశాయి. కరోనా వైరస్ కు ఔషధం కనుగొనడానికి బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని

పతంజలి నుంచి కరోనా ఔషధం.. క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. చాలా దేశాలు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు ముమ్మరం చేశాయి. కరోనా వైరస్ కు ఔషధం కనుగొనడానికి బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ కూడా రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన డ్రగ్ ట్రయల్ ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధి బాలక్రిష్ణ తెలిపారు. అవసరమైన రెగ్యులేటరీ ఆమోదాలు పొందిన తరువాత కోవిద్-19 చికిత్స కోసం మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని పతంజలి గ్రూప్ తెలిపింది.

కాగా.. పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ మేము రెగ్యులేటరీ అనుమతి పొందిన తరువాత, ఇండోర్, జైపూర్ లోని కంపెనీ యూనిట్లలో క్లినికల్ ట్రయల్ ప్రారంభిస్తామని చెప్పారు. కరోనా చికిత్సకు వ్యాక్సిన్, ఔషధం కోసం ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా కంపెనీలు, ప్రయోగాలు చేస్తున్నాయి.

గిలీడ్ సైన్సెస్, ఫైజర్, జాన్సన్ & జాన్సన్, మోడెర్నా, ఇన్నోవియో ఫార్మా, గ్లాక్సో స్మిత్‌క్లైన్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పెద్ద కంపెనీల జాబితాలో పతంజలి పేరు చేరడం సంస్థకి పెద్ద విజయమే అని నిర్వాహకులు పేర్కొన్నారు.

Also Read: ఏపీలో ఇంటర్ ప్రైవేటు కాలేజీ అడ్మిషన్లకు.. నయా రూల్స్..