గౌతమ్ గంభీర్ ఇంట్లో కారు చోరీ..
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తండ్రి దీపక్ గంభీర్‌కు చెందిన ఓ కారు చోరీకి గురైంది. గంభీర్ ఇంటిముందు పార్కు చేసిన ఎస్‌యూవీ కారును గురువారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని గంభీర్ ఇంటిముందు కారు చోరీకి గురైనట్లు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ సెంట్రల్ డీసీపీ స్పందిస్తూ… ‘రాజేంద్రనగర్‌లోని గంభీర్ ఇంటిముందు కారు పార్కు చేయగా.. గురువారం తెల్లవారుజామున అపహరణకు గురైంది. ఈ […]

టీమ్ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తండ్రి దీపక్ గంభీర్‌కు చెందిన ఓ కారు చోరీకి గురైంది. గంభీర్ ఇంటిముందు పార్కు చేసిన ఎస్‌యూవీ కారును గురువారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని గంభీర్ ఇంటిముందు కారు చోరీకి గురైనట్లు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై ఢిల్లీ సెంట్రల్ డీసీపీ స్పందిస్తూ… ‘రాజేంద్రనగర్‌లోని గంభీర్ ఇంటిముందు కారు పార్కు చేయగా.. గురువారం తెల్లవారుజామున అపహరణకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే పలు టీమ్స్ దొంగలను పట్టకునే పనిలో నిమగ్నమయ్యాయి. దొంగల ఆనవాళ్ల కోసం గంభీర్ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం. అతి త్వరలోనే దొంగలను పట్టుకుంటాం’ అని పేర్కొన్నారు. గంభీర్ రాజేంద్రనగర్‌లోని తన ఇంటిలో తండ్రితో కలిసి ఉంటున్నారు.
భారత క్రికెట్ టీమ్ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ దేశం తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లను భారత్ కైవసం చేసుకోవడంలో గంభీర్ కీలకపాత్ర పోషించాడు.




