మోదీతో అమిత్ షా కీలక భేటీ..లాక్‌డౌన్ పై వ్యూహ రచన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ నెల 31న లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

మోదీతో అమిత్ షా కీలక భేటీ..లాక్‌డౌన్ పై వ్యూహ రచన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ నెల 31న లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలోనే లాక్‌డౌన్ ఐదో దశ విధించాలా వద్దా అనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. కాబట్టి వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న జోన్లలోనే లాక్‌డౌన్ కొనసాగిస్తూ..మిగతా చోట్ల ఎత్తివేసే విషయంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. కరోనా తీవ్రత ఉన్న చోట్ల కట్టడి చేస్తూ లేని ప్రాంతాల్లో మరింత వెసులుబాటు ఇచ్చే అవకాశంపైనా చర్చించినట్లు సమాచారం.