విషాదం.. భర్త స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు, చిరు ఉద్యోగులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఏవైనా ఖరీదైన వస్తువుల్ని కొనాలంటే.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ.. నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోని మైదాని ఘర్హీ ప్రాంతంలో ఓ వివాహిత.. ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వకపోవడంతో.. తన శరీరానికి నిప్పంటించుకుంది. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. […]

విషాదం.. భర్త స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు, చిరు ఉద్యోగులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఏవైనా ఖరీదైన వస్తువుల్ని కొనాలంటే.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ.. నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోని మైదాని ఘర్హీ ప్రాంతంలో ఓ వివాహిత.. ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వకపోవడంతో.. తన శరీరానికి నిప్పంటించుకుంది. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మే 27వ తేదీన చోటుచేసుకుంది. అయితే ఆస్పత్రికి తరలించే సమయానికి ఆమె శరీరం 90 శాతం కాలిపోయింది. అయితే వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. శుక్రవారం నాడు ఆమె ప్రాణాల్ని కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మృతురాలి భర్త.. తన భార్య స్మార్ట్ ఫోన్ కావాలని
కోరిందని.. పిల్లకు ఆన్‌లైన్ క్లాసులు నమోదవుతున్నాయని చెప్పిందని.. అయితే లాక్‌డౌన్ ముగిసిన తర్వాత.. కొందామని చెప్పానని.. అయితే ఇంతలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని వాపోయాడు.