AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్‌.. పాల్‌ఘర్‌లో మరో దారుణం.. ఇద్దరు సాధువులపై దాడి చేసి.. ఆ తర్వాత..

మహారాష్ట్రలో మరో దారుణం చోటుచేసుకుంది. పాల్‌ఘర్‌లో సాధువులపై మూకదాడి చేసి ఇద్దర్ని చంపేసిన ఘటన మరవకముందే.. మళ్లీ ఇదే ప్రాంతంలో మరో సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బలివాలీ సమీపంలోని వాసాయి గ్రామ సమీపంలో ఉన్న జాగృత్ మహాదేవ్‌ మందిర్‌లో గురువారం తెల్లవారుజామున ఇద్దరు సాధువులపై దాడి జరిగింది. ఆలయంలోనికి ముగ్గురు దుండగులు.. ఆయుధాలతో ప్రవేశించి.. అక్కడి ఆలయంలో పూజలు నిర్వహించే దయానంద్‌ సరస్వతి, శ్యామ్‌ సింగ్‌లపై దాడికి దిగారు. అనంతరం.. ఆలయంలో ఉన్న రూ. 6800/- నగదును […]

బ్రేకింగ్‌.. పాల్‌ఘర్‌లో మరో దారుణం.. ఇద్దరు సాధువులపై దాడి చేసి.. ఆ తర్వాత..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 29, 2020 | 2:04 PM

Share

మహారాష్ట్రలో మరో దారుణం చోటుచేసుకుంది. పాల్‌ఘర్‌లో సాధువులపై మూకదాడి చేసి ఇద్దర్ని చంపేసిన ఘటన మరవకముందే.. మళ్లీ ఇదే ప్రాంతంలో మరో సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బలివాలీ సమీపంలోని వాసాయి గ్రామ సమీపంలో ఉన్న జాగృత్ మహాదేవ్‌ మందిర్‌లో గురువారం తెల్లవారుజామున ఇద్దరు సాధువులపై దాడి జరిగింది. ఆలయంలోనికి ముగ్గురు దుండగులు.. ఆయుధాలతో ప్రవేశించి.. అక్కడి ఆలయంలో పూజలు నిర్వహించే దయానంద్‌ సరస్వతి, శ్యామ్‌ సింగ్‌లపై దాడికి దిగారు. అనంతరం.. ఆలయంలో ఉన్న రూ. 6800/- నగదును దోచుకెళ్లారు. అంతేకాదు.. ఆలయంలో ఉన్న పలు విలువైన వస్తువులను కూడా దోచుకెళ్లినట్లు ఆలయ పూజారులు తెలిపారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున 12.30 గంటలకు చోటుచేసుకుంది. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితుల్లో ఒకర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి రెండువేల నగదును స్వాధీనం చేసుకున్నామని.. మిగతా ఇద్దరి దుండగుల కోసం గాలింపు చేపడుతున్నామని తెలిపారు.

కాగా, ఇదే జిల్లాలో గత ఏప్రిల్‌ నెల 16వ తేదీన.. వాహనంలో సూరత్‌ వెళ్తున్న సాధువులపై గ్రామస్థులు మూకదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటు.. వాహన డ్రైవర్‌ కూడా మరణించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 115 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. తాజాగా.. ఇదే ప్రాంతంలో సాధువులపై దాడి జరగడం కలకలం రేపుతోంది.

Follow Us
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..