#BeTheREALMANchallenge : పరిటాల శ్రీరామ్ కొత్త పంథా..నాన్నే స్ఫూర్తిగా..
అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ లో చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సందీప్ వంగా విసిరిన ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఫిల్మ్ సెలబ్రిటీస్ అంతా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్ పై పొలిటికల్ లీడర్స్ సైతం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తనను ఎవరు నామినేట్ చేయకపోయినా టీడీపీ ఫైర్ బ్రాండ్ పరిటాల శ్రీరామ్…తన పంథాలో #BeTheREALMANchallenge ను కంప్లీట్ చేశారు. తన కుటుంబ నేపథ్యానికి […]

అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ లో చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సందీప్ వంగా విసిరిన ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఫిల్మ్ సెలబ్రిటీస్ అంతా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్ పై పొలిటికల్ లీడర్స్ సైతం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తనను ఎవరు నామినేట్ చేయకపోయినా టీడీపీ ఫైర్ బ్రాండ్ పరిటాల శ్రీరామ్…తన పంథాలో #BeTheREALMANchallenge ను కంప్లీట్ చేశారు. తన కుటుంబ నేపథ్యానికి తగ్గట్టుగా వ్యవసాయ పనులు చేశారు. పశువులకు దానా వేశారు. ఆ తర్వాత కర్రల మోపును ట్రాక్టర్ లో పొలం నుంచి ఇంటికి తీసుకువచ్చారు.
రైతు బిడ్డగా వ్యవసాయ పనులు చేసి..హ్యాట్సాఫ్ అనిపించుకున్నారు శ్రీరామ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో పేర్కొంటూ.. ”నాన్నకి ఇష్టమైన, నాకు అందుబాటులో ఉన్న వ్యవసాయ పనులు చేశాను. మీరు కూడా మీకు అందుబాటులో వున్న పనులు చేస్తారని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. అంతేగాక ఈ ఛాలెంజ్‌కు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ ఎంపీలు జయదేవ్ గల్లా, రామ్మోహన్ నాయుడు.. సినీ నటుడు మోహన్ బాబు, సినీ దర్శకుడు ఎన్.శంకర్, శ్యామ్ బాబులను నామినేట్ చేశారు. ఇక పరిటాల శ్రీరామ్ వీడియోకి నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
#BeTheREALMANchallenge నాన్నకి ఇష్టమైన, నాకు అందుబాటులో వున్న వ్యవసాయ పనులు చేశాను. మీరు కూడా మీకు అందుబాటులో వున్న పనులు చేస్తారని ఆశిస్తూ.. I further nominate @naralokesh @JayGalla @RamMNK @themohanbabu @IamNShankar #KEShyamBabu to take up this challenge ?? pic.twitter.com/FdcGIlMnyj
— Paritala Sreeram (@IParitalaSriram) April 25, 2020
