అయ్యప్ప దర్శనం : ప్రభుత్వానికి హైలెవల్ కమిటీ కీలక సూచనలు

శబరిమలలో దర్శనాలు, భక్తుల రాక సహా పలు అంశాలపై హైలెవల్ కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలతో నివేదిక చేసింది. పంపా ద్వారా మాత్రమే యాత్రికులను అనుమతించడం....

అయ్యప్ప దర్శనం : ప్రభుత్వానికి హైలెవల్ కమిటీ కీలక సూచనలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 07, 2020 | 1:55 PM

శబరిమలలో దర్శనాలు, భక్తుల రాక సహా పలు అంశాలపై హైలెవల్ కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలతో నివేదిక చేసింది. పంపా ద్వారా మాత్రమే యాత్రికులను అనుమతించడం, యాత్రికుల సంఖ్యను సాధారణ రోజులలో 1,000 మందికి, వారాంతాల్లో 2,000 కు పరిమితం చేయడం, కోవిడ్-19- నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయడం వంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి. నవంబర్ 16 నుంచి శబరిమలలో మండల-మకరవిలక్కు యాత్రలు ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో విశ్వస్ మెహతా నేతృత్వంలోని కమిటీ ఈ సూచనలు చేసింది. 

 10-60 ఏళ్ల వయస్సులో ఉన్న యాత్రికులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని, 60-65 ఏళ్ళ వయస్సులో ఉన్నవారు అయ్యప్పను దర్శించుకోవాలంటే ఆరోగ్య సమస్యలు లేవని పేర్కొంటూ ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుందని కమిటీ నివేదించింది. మండల పూజ, మకరవిలక్కులకు 5,000 మంది యాత్రికులను అనుమతించవచ్చని నివేదికలో కమిటీ పొందుపరిచింది. 

తాంత్రి, ఆలయ అధికారులతో చర్చలు జరిపిన తర్వాతే ఆన్‌లైన్ దర్శనంపై నిర్ణయం తీసుకుంటామని కేరళ పర్యాటక మంత్రి కదకంపల్లి సురేంద్రన్ మంగళవారం చెప్పారు. రెండు నెలల తీర్థయాత్రల సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వం కమిటీ సిఫారసులను పరిశీలిస్తుందని, త్వరలో మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆయన అన్నారు. ( ఆ ఆలయంలో దేవుడి సంచారం, ట్విస్ట్ ఏంటంటే..?  )

యాత్రికులందరూ www.covid19jagratha.kerala.nic.in పోర్టల్‌లో నమోదు చేసుకుని, దర్శనానికి 48 గంటల ముందు కోవిడ్-19 నెగటివ్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాలి.  తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల యాత్రికులు వస్తున్నందున, ఆరోగ్య శాఖ పంపా, నీలక్కల్ వద్ద పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. సాంప్రదాయ మార్గం ద్వారా ట్రెక్కింగ్, పంపాలో స్నానం చేయడం తాత్కాలికంగా నిషేధించారు. అభిషేకం కోసం ఇచ్చిన నెయ్యి భక్తులకు లభించదు. ( రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి )