‘‘డొనాల్డ్‌ ట్రంప్‌ నా నిజమైన తండ్రి. నేను మా నాన్నని కలుసుకోవాలి ’’ అంటున్న పాకిస్తాన్ యువతి.. వీడియో వైరల్

‘‘నేను జోక్‌ చేయడం లేదు. సీరియస్‌గా మాట్లాడుతున్నాను. డొనాల్డ్‌ ట్రంప్‌ నా నిజమైన తండ్రి’’ అని పాకిస్తాన్ యువతి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Rajeev Rayala
  • Publish Date - 6:45 pm, Tue, 1 December 20
‘‘డొనాల్డ్‌ ట్రంప్‌ నా నిజమైన తండ్రి. నేను మా నాన్నని కలుసుకోవాలి ’’ అంటున్న పాకిస్తాన్ యువతి.. వీడియో వైరల్

‘‘నేను జోక్‌ చేయడం లేదు. సీరియస్‌గా మాట్లాడుతున్నాను. డొనాల్డ్‌ ట్రంప్‌ నా నిజమైన తండ్రి. నేను మా నాన్నని కలుసుకోవాలని భావిస్తున్నాను. ఆయన నన్ను, మా అమ్మని పట్టించుకోవడం మానేశారు. దీని గురించి మా అమ్మ, ట్రంప్‌తో గొడవపడేది’’ అని పాకిస్తాన్ యువతి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే, ఈ వీడియో 2018 డిసెంబరులో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరో సారి నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. తాజాగా మరోసారి వైరలవుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌కి‌ ఇవాంకా ట్రంప్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, బారన్ ట్రంప్, ఎరిక్ ట్రంప్, టిఫనీ ట్రంప్… ఐదుగురు సంతానం.