AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయం గుప్పిట్లో పాక్… ఐరాస సాయం కోసం వేడుకోలు

40 మంది భారత సైనికులను పొట్టన బెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందిస్తుండడంతో  పాకిస్తాన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. సరిహద్దుల్లో భారత్ సైన్యాన్ని మొహరిస్తుండటంతో పాక్ వణికిపోతోంది. దీంతో ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఐక్య రాజ్య సమితికి పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్‌కి లేఖ రాశారు. […]

భయం గుప్పిట్లో పాక్... ఐరాస సాయం కోసం వేడుకోలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 7:22 PM

Share

40 మంది భారత సైనికులను పొట్టన బెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందిస్తుండడంతో  పాకిస్తాన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. సరిహద్దుల్లో భారత్ సైన్యాన్ని మొహరిస్తుండటంతో పాక్ వణికిపోతోంది. దీంతో ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఐక్య రాజ్య సమితికి పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్‌కి లేఖ రాశారు. పాకిస్తాన్‌పై భారత్ తన సైన్యాన్ని ప్రయోగించే అవకాశం ఉండడంతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తోందని లేఖలో వెళ్లడించింది. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అని ఖురేషీ సదరు లేఖలో పేర్కొన్నట్టు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా భారత సైనికులపై పుల్వామాలో జరిగిన దాడి కశ్మీరీ వ్యక్తి పనేననీ… కానీ విచారణ కూడా పూర్తి కాకుండానే పాకిస్తాన్‌ను నిందించడంలో అర్థం లేదని ఖురేషీ పేర్కొన్నారు. దేశంలోని రాజకీయ కారణాల కోసం భారత్ కావాలని తమపై శత్రు భావాన్ని ప్రదర్శించి, ఉద్రిక్తతలు పెంచుతోందని ఆయన ఆరోపించారు. ఈ నెల 14న కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడి వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉందని భారత్ చెబుతుండగా… తమకు సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. ఓ వైపు పుల్వామా దాడికి తమదే బాధ్యత అంటూ పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే స్పష్టంగా వీడియో విడుదల చేసినా.. పాకిస్తాన్ బుకాయించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..