Army chief : కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. దాయాది పాకిస్తాన్‌పై భారత ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే తీవ్రంగా ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ఇప్పటికీ తన కుంచిత దృష్టిని ఏమాత్రం వదులుకోవడం లేదని, జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపాలన్న దాని అజెండాను వదులుకోవడం లేదని మండిపడ్డారు. తరుచూ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్‌కు అదే స్థాయిలో జవాబిచ్చి తీరుతామని ఆయన తేల్చి చెప్పారు.
కాగా.. హంద్వారా ఎన్‌కౌంటర్ పై నరవాణే స్పందిస్తూ… పౌరుల ప్రాణాలను కాపాడడానికి హంద్వారా ఎన్‌కౌంటర్‌లో కల్నల్, మేజర్‌తో పాటు మరో ముగ్గురు జవాన్ల వీరమరణాన్ని చూసి భారత జాతి గర్విస్తోందని తెలిపారు. హంద్వారా ఎన్‌కౌంటర్‌కు నాయకత్వం వహించిన కల్నల్ అశుతోశ్ శర్మశౌర్యాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
Also Read: 45 నిముషాల్లో రూ. 2లక్షల లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ..