AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్‌ కోహ్లీకి తాను పెద్ద ఫ్యాన్‌ని అంటున్న పాక్‌ బౌలర్‌ భార్య

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.. ఈ జనరేషన్‌ క్రికెట్‌ లవర్స్‌ ఎక్కువగా ఇష్టపడేది విరాట్‌నే! పాకిస్తాన్‌లో అయితే వీరాభిమానులున్నాయి.

విరాట్‌ కోహ్లీకి తాను పెద్ద ఫ్యాన్‌ని అంటున్న  పాక్‌ బౌలర్‌ భార్య
Big Fan Of Virat Kohli
Balu
| Edited By: Phani CH|

Updated on: Jun 07, 2021 | 12:43 PM

Share

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.. ఈ జనరేషన్‌ క్రికెట్‌ లవర్స్‌ ఎక్కువగా ఇష్టపడేది విరాట్‌నే! పాకిస్తాన్‌లో అయితే వీరాభిమానులున్నాయి. అక్కడ ఎవరిని అడిగినా తమ ఫెవరేట్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీనే అని చెబతారు.. ఎక్కడ చూసినా కోహ్లీ బొమ్మలే కనిపిస్తాయి. 2019లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ గుర్తుంది కదా! అప్పుడు కోహ్లీని మాకిచ్చేయండి అంటూ పాక్‌ యువతి రిజ్లా రెహాన్ చేసిన హడావుడి కూడా గుర్తుండే ఉంటుంది. పాక్‌ అమ్మాయిలకు కలల రాకుమారుడాయన!. బహిరంగంగా కోహ్లీకి లవ్‌ ప్రపోజ్‌ చేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఓ అమ్మాయి అయితే ఏకంగా స్టేడియంలోనే విరాట్ నన్ను పెళ్లి చేసుకుంటావా..? అంటూ ప్లకార్డ్‌ని ప్రదర్శించింది.

లేటెస్ట్‌గా పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ భార్య షామియా అర్జూ కూడా తన ఫేవరెట్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీనేనని చెప్పారు. ఈ మధ్యన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించారు షామియా‌. నీ ఫేవరెట్ బౌలర్‌ ఎవరని అడిగితే హసన్‌ అలీనే అని జవాబిస్తారని మాకు తెలుసు.. మరి మీ ఫేవరెట్ బ్యాట్స్‌మెన్‌ ఎవరో చెప్పండి అని అమెను ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు.. దానికి షామియా అర్జూ ఒక్క క్షణం కూడా ఆలోచించకకుండా విరాట్ కోహ్లీ పేరు చెప్పారు. షామియా అర్జూ పుట్టింది ఇక్కడే.. ఆమె స్వస్థలం హర్యానా రాష్ట్రం.. ఆమె కుటుంబం ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తోంది. ఎమిరేట్ ఎయిర్‌లైన్స్‌లో ప్లైయిట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నప్పుడు షామియాకు హసన్‌ అలీ పరిచయమయ్యారు. కొంతకాలం స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అప్పట్లో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులు దుబాయ్‌లో పార్టీ కూడా ఇచ్చారు.

అంతెందుకు పాక్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ అయితే విరాట్‌కు డైహార్డ్‌ ఫ్యాన్‌. ఇప్పుడు ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో బాబర్‌ ఆజామ్‌ విరాట్‌ను అధిగమించాడు. నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడున్న అతి గొప్ప బ్యాట్స్‌మెన్‌లో బాబార్‌ ఒకరు. కొందరు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అయిన విరాట్ కోహ్లీతో బాబర్‌ ఆజమ్‌ను పోలుస్తుంటారు. అలా తనను కోహ్లీతో పోల్చినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుందంటాడు ఆజామ్‌ తెలిపాడు. విరాట్‌ ప్రపంచంలోనే గొప్ప ఆటగాడని, ఇప్పటికే పలుసార్లు తన బ్యాటింగ్‌తో ఆ విషయాన్ని రుజువు చేసుకున్నాడని బాబర్‌ అన్నాడు. అన్ని రకాల ఫార్మట్లలో కోహ్లీ అద్భుతమైన ఆటను ప్రదర్శించాడని తెలిపాడు. అసలు అంత పెద్ద ఆటగాడితో తనను పోలుస్తున్నందుకు తానేంతో గర్వపడతానని అన్నాడు. బాబరే కాదు.. పాకిస్తాన్‌ క్రికెట్‌జట్టులో చాలా మందికి విరాట్‌ కోహ్లీ ఓ ఇన్‌ స్ప్రిరేషన్‌. కోహ్లీని ఇష్టపడతారు..

మరిన్ని ఇక్కడ చూడండి: Corona: దేశీయ విమాన ప్ర‌యాణికుల‌కు ఇక‌పై నెగిటివ్ రిపోర్ట్‌ అవ‌స‌రం లేదు? ఈ ఛాన్స్ వారికి మాత్ర‌మే..

Covid Vaccines Fact: వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందా..? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంతా..?