AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగ్గుచేటు.. 49 పరుగులకే ఆలౌట్.. 9మంది సింగిల్ డిజిట్‌కే.. పొట్టి ఫార్మాట్ పరువు తీసేశారుగా..

Paarl Royals vs Sunrisers Eastern Cape: దక్షిణాఫ్రికాలో SA20 లీగ్ (2025-26 సీజన్) మొదలైంది. డిసెంబర్ 26, శుక్రవారం నుంచి ఈ లీగ్ సాగుతోంది. కాగా, సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్,సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఈ మూడు మ్యాచ్‌లలో విజయం సాధించగా, ఎంఐ కేప్ టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్, పార్ల్ రాయల్స్ ఓడిపోయాయి.

సిగ్గుచేటు.. 49 పరుగులకే ఆలౌట్.. 9మంది సింగిల్ డిజిట్‌కే.. పొట్టి ఫార్మాట్ పరువు తీసేశారుగా..
Paarl Royals Vs Sunrisers Eastern Cape
Venkata Chari
|

Updated on: Dec 29, 2025 | 12:22 PM

Share

Paarl Royals vs Sunrisers Eastern Cape: క్రికెట్ ప్రపంచంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన SA20 లీగ్‌లో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పార్ల్ రాయల్స్ జట్టు, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రదర్శనలలో ఒకటిగా నిలుస్తూ, ఆ జట్టు కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది.

సన్‌రైజర్స్ బౌలర్ల మాయాజాలం..

సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. పిచ్ కండిషన్స్‌ను అద్భుతంగా వాడుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు మొదటి ఓవర్ నుండే వికెట్ల వేట మొదలుపెట్టారు. ముఖ్యంగా మార్కో జాన్సెన్ తన పదునైన బంతులతో పార్ల్ రాయల్స్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు.

వరుస విరామాల్లో వికెట్లు..

పార్ల్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ తో సహా స్టార్ ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. పవర్ ప్లే ముగిసేసరికి రాయల్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మధ్యలో స్పిన్నర్లు కూడా తమ ప్రతాపాన్ని చూపడంతో స్కోరు బోర్డు కదలడమే కష్టమైంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Team India: టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా యువ సంచలనం.. సూర్యకుమార్‌పై వేటు.. గిల్‌కు నో ఛాన్స్.?

చివరికి 12.4 ఓవర్లలోనే ఆ జట్టు 49 పరుగులకు కుప్పకూలింది. ఇది SA20 లీగ్ చరిత్రలో నమోదైన అతి తక్కువ స్కోరుగా రికార్డు సృష్టించింది.

సునాయాసంగా గెలిచిన సన్‌రైజర్స్..

50 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఎటువంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం కొద్ది ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా విజయాన్ని అందుకుంది. ఈ భారీ విజయంతో సన్‌రైజర్స్ జట్టు తన నెట్ రన్ రేట్‌ను భారీగా మెరుగుపరుచుకోవడమే కాకుండా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దిశగా అడుగులు వేసింది.

ఇది కూడా చదవండి: Team India: ద్రవిడ్ హయాంలో తోపు ఫినిషర్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌గా మార్చిన గంభీర్..

ఈ ఓటమి పార్ల్ రాయల్స్ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. రాబోయే మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోకపోతే ఆ జట్టు సెమీస్ చేరడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం ప్రస్తుతం టోర్నీలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..