AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ‘ఓయో’ కీలక నిర్ణయం..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్ని అతలాకుతలమయ్యాయి. సాఫ్ట్‌బ్యాంక్ సహకారంతో భారత్‌లోనే అతిపెద్ద హోటల్ చెయిన్‌గా అవతరించిన ప్రముఖ వ్యాపార సంస్థ ఓయో ఉద్యోగుల

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. 'ఓయో' కీలక నిర్ణయం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 5:54 PM

Share

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్ని అతలాకుతలమయ్యాయి. సాఫ్ట్‌బ్యాంక్ సహకారంతో భారత్‌లోనే అతిపెద్ద హోటల్ చెయిన్‌గా అవతరించిన ప్రముఖ వ్యాపార సంస్థ ఓయో ఉద్యోగుల జీతాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో హోటల్స్ మూతపడటంతో రూమ్స్ బుకింగ్ అవకాశమే లేదు. దీంతో.. ఓయో సంస్థ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

కాగా.. ఇండియాలో పనిచేస్తున్న 7వేల మంది ఓయో ఉద్యోగుల జీతాల్లో నాలుగు నెలల పాటు 25 శాతం కోత విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ జీతం నుంచే కోతలు మొదలవుతాయని స్పష్టం చేసింది. మే 4 నుంచి సంస్థలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు నాలుగు నెలల పాటు సెలవులిచ్చి ఇళ్లకే పరిమితం చేయాలని ఓయో నిర్ణయించింది. అయితే.. వీరికి కొంత పరిమిత ప్రయోజనాన్ని సంస్థ చెల్లించనుంది.

Also Read: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఇక వారిపై దాడి చేస్తే జైలు, భారీ జరిమానా

Follow Us